ఎన్టీఆర్ - రామ్ చరణ్ కన్నా అల్లు అర్జున్ గొప్ప‌.. నిజంగా ఆయనకి అంత సీన్ ఉందా ?

Amruth kumar
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడ చూసిన పుష్ప2 ఫీవర్ కనిపిస్తుంది.. పుష్ప సినిమాతో బాలీవుడ్ లో అదిరిపోయే క్రేజ్‌  తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు అంతకు మించి సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే ఈ సినిమాతో డిసెంబర్ 6న ప్రేక్షకుల‌ ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప2  పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుంటుందని మేకర్స‌ భారీ రేంజ్ లో ప్రమోషన్లు అయితే చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో అంత కలెక్షన్లు వచ్చే అంత స్టామినా ఉందా లేదా అని మరి కొంతమంది సినీ మేధావులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇప్పుడు ఏదేమైనా పుష్ప 2  సినిమా తో భారీ సక్సెస్ దక్కుతుందని అల్లు అర్జున్ భావిస్తున్నారు. త్రిబుల్ ఆర్‌ సినిమా కంటే ఈ సినిమా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటూ కొన్ని ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు.  ఇక ఎన్టీఆర్ - రామ్ చరణ్ ని కలిపితే ఎంత బిజినెస్ అయితే అయిందో ఒక అల్లు అర్జున్ మీద అంత బిజీనెస్ జ‌రగ‌టంతో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్ గ్రేట్ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇక నిజానికి పుష్ప2 సినిమాకు ఆ రేంజ్ లో నిజంగా బిజినెస్‌ జరిగిందా లేదంటే వీళ్ళు ఫేక్ వార్తలు చెబుతున్నారు అనేది తెలియాల్సిన అవసరమైతే ఉంది.

ఇలాంటి వార్తలు చూస్తున్న కొంత మంది మాత్రం అల్లు అర్జున్ అంటేనే కొంచెం అతి చేస్తూ ఉంటాడు ఆయన చెప్పే దాంట్లో చేసేదాంట్లో ఏది నిజమై ఉండదు. ఇందులో చాలావరకు తప్పులు వార్త‌లే ఉంటాయి కాబట్టి ఈ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఫేక్ అంటూ కొట్టి పడేస్తున్నారు. ఇక నిజానికి రామ్‌చరణ్ , ఎన్టీఆర్ అని కొట్టేంత దమ్ము అల్లు అర్జున్ ఉందా అంటూ మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏదేమైనా అల్లు అర్జున్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో నెంబర్ వన్ హీరోగా ఎద‌గాలనే ప్రయత్నంలో తన అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇక  పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్న ఆయన ఇప్పుడు అంతకుమించి గుర్తింపు సంపాదించుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నాడు .
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: