ప్రభాస్‌తో దుల్కర్ సల్మాన్...మల్టీస్టారర్ మూవీ ?

Veldandi Saikiran
దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాను నటించిన ప్రతి ఒక్క సినిమా సూపర్ హిట్ అవుతాయి. దీంతో దుల్కర్ సల్మాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన చిత్రం "లక్కీ భాస్కర్". ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశాడు. తెలుగులో మల్టీ స్టార్లర్ అవకాశం వస్తే ప్రభాస్ కచ్చితంగా చేస్తాను అంటూ ఈ హీరో అనౌన్స్ చేశాడు.
వైవిధ్యభరితమైన సినిమాలు, పాటలతో దేశవ్యాప్తంగా దుల్కర్ సల్మాన్ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తెలుగులో మహానటి, సీతారామం వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఈ హీరో తన తదుపరి చిత్రం లక్కీ భాస్కర్ సినిమా కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి, ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నటించారు. "సాధారణ మనిషి  అసాధారణ ప్రయాణం"గా లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా కోసం ఓవైపు చిత్ర బృందం, మరోవైపు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21 2024న ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో ట్రైలర్ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.... 14 నెలల అనంతరం నా నుంచి లక్కీ భాస్కర్ సినిమా వస్తుందని అన్నాడు. ట్రైలర్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానని హీరో దుల్కర్ సల్మాన్ చెప్పారు. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా అని అన్నారు. హాస్యం, భావోద్వేగాలు, కుటుంబ కథ, సంగీతం ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉన్నాయని దుల్కర్ సల్మాన్ చెప్పారు. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నానని దుల్కర్ సల్మాన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ హీరో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: