టాలీవుడ్‌లో గోలగోల... సంక్రాంతి సినిమాలు 3 కాదు... 6 ..!
ఈ సీజన్‌లో ఎన్ని సినిమాలు వస్తాయి అర్థం కాక.. గందరగోళం నెలకొంది. ఈ సీజన్‌లో ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు ఆరు సినిమాలు రాబోతున్నాయి అన్న అంచనా ఉంది. అయితే ఒక గేమ్ ఛేంజర్ తప్ప ఏ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. అయితే నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ ఈ సంక్రాంతికి మూడు సినిమాలు మాత్రమే వస్తాయని చెప్పారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు.. బాలయ్య బాబు సినిమా. దాంతో పాటు తమిళం నుంచి వస్తున్న గుడ్ బాడ్ అగ్లీ.. ఇవి మాత్రమే రేసులో ఉన్నాయని ముందు అందరూ భావించారు. వెంకటేష్ - అనిల్ రావుపూడి సినిమా కూడా సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంక్రాంతి వస్తున్నాం అనే టైటిల్ పెట్టి అవకాశాలు ఉన్నాయి.
చిరంజీవి విశ్వంభర సినిమా సంక్రాంతికి రావాల్సి ఉంది. అయితే రామ్ చరణ్ సినిమా కోసం విశ్వంభర సినిమాను వాయిదా వేశారు. ఇక పైన చెప్పుకున్న సినిమాలతో పాటు సందీప్ కృష్ణ.. మజాకా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. వామన కూడా ఈ సంక్రాంతికి రావాలని భావిస్తున్నాయి. నాగచైతన్య తండేల్ సినిమా కూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ ఇన్సెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ దిల్ రాజు బ్యానర్లో వస్తుంది. కాబట్టి.. వెంకటేష్ - అనిల్ రావిపూడి సినిమాను వాయిదా వేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాగచైతన్య తండేల్ ఏకంగా రూ.100 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కింది.
ఇలాంటి సినిమాలు సంక్రాంతికి వస్తే బాగుంటుంది. మరి అయితే బాలయ్య, రామ్ చరణ్ సినిమాల మధ్యలో పోటీగా నిలబడి నాగచైతన్య సినిమా ఎంతవరకు తట్టుకుంటుంది అన్నది చెప్పలేని పరిస్థితి. ప్రతి సంక్రాంతి కనీసం నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాలుగు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు సర్దుబాటు కష్టమవుతుంది. ఇంకా ఎక్కువ సినిమాలు ఇస్తే వాళ్ళల్లో వాళ్ళు పోటీపడి సినిమా వసూళ్లకు గండి పడే ప్రమాదం ఉంది. ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నిర్మాతలు ముందుగా ఒక అవగాహనకు వచ్చి సినిమాల రిలీజ్ డేట్‌లు ప్రకటిస్తే బాగుంటుంది.