ఆరోజు రాత్రి రాజమౌళి అంతలా గుక్క పట్టి ఎందుకు ఏడ్చాడు..? కన్నీళ్లు తెప్పిస్తున్న జక్కన్న మాటలు..!
ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. దానికి కారణం ఆయన డెడికేషన్ . ఏ పాత్రకి ఎవరు సూట్ అవుతారు..? ఏ వర్క్ ఎలా చేయాలి? ఎలా చేస్తే జనాలకి నచ్చుతుంది అంటూ జనాల నాడిని పట్టుకొని ఆ సినిమాని తెరకెక్కిస్తూ ఉంటాడు . అయితే అటువంటి రాజమౌళి కూడా ఒకనాడు గుక్క పట్టి ఏడ్చేసాడట . దానికి కారణం బాహుబలి సినిమా .
బాహుబలి సినిమా మొదటిరోజు నెగిటివ్ టాక్ దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే . దాదాపు వందల కోట్లు బడ్జెట్ పెట్టి నిర్మాతలు ఎంతో బిగ్ రిస్క్ చేసిన సినిమా బాహుబలి. రాజమౌళిని నమ్మి నిర్మాతలు చాలా చాలా డబ్బు ఖర్చు చేశారు . అనుకున్న దానికి డబుల్ కాదు ట్రిపుల్ స్థాయిలో ఖర్చు పెట్టారు నిర్మాతలు అంటూ రాజమౌళిని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . అయితే బాహుబలి 1 రిలీజ్ అయిన మొదటి రోజు ఈ సినిమా నెగిటివ్ టాక్ దక్కించుకుంది .
జులై 10 2015 నాడు ఈ సినిమా రిలీజ్ అయింది . మొదటి రోజే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో జక్కన్న చాలా బాధపడ్డాడు . అటు ఇటుగా మారి సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతల పరిస్థితి ఏంటి .. ? నన్ను నమ్మి అంత డబ్బులు ఖర్చు చేశారు ఎలా..? అంటూ ఆరోజు నైట్ మొత్తం జక్కన్న అస్సలు నిద్రపోలేదట. ఒకానొక మూమెంట్లో ఏడ్చేసాడట. అయితే ఆ తర్వాత రెండో రోజు నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ రావడం మొదలుపెట్టింది . మూడవ రోజు సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ కలెక్షన్స్ భారీగా పుంజుకున్నాయి. దీంతో రాజమౌళి ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి ఒక ఈవెంట్ లో బయట పెట్టడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. రాజమౌళి మాట్లాడుతున్నప్పుడు పలువురు అక్కడ ఉండే ఆయన ఫ్యాన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలా రాజమౌళి సినిమా కోసం కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా అందుకున్నాడు..!