స్టార్ హీరోతో నైట్ పార్టీకి హీరోయిన్ త్రిష ?

Veldandi Saikiran
త్రిష ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అయితే ఇటీవల కాలంలో త్రిష విపరీతంగా వార్తల్లో నిలుస్తోంది. తన 20 ఏళ్ల సినీ కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్యకాలంలో త్రిష గురించి అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా రాణించింది. యంగ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి రావడంతో త్రిష హవా కాస్త తగ్గిపోయింది.

అయితే త్రిష ఇటీవల మళ్ళీ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. పొన్నియిన్ సెల్వన్ రెండు పార్ట్ లలో నటించిన త్రిష మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష కు భారీగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం త్రిష చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉంటుంది.

సౌత్ స్టార్ హీరోలు చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్లాల్ సినిమాల్లో నటిస్తూ త్రిష బిజీగా మారిపోయింది. ఇదిలా ఉండగా.... త్రిష వ్యక్తిగత విషయానికి వస్తే, ఈమె గతంలో ఓ బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకోవాలని అనుకుంది. ఎంగేజ్మెంట్ వరకు వెళ్లిన వీరి వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటినుంచి త్రిష ఇప్పటివరకు సింగిల్ గానే ఉంటుంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే త్రిష తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంది. ఈ ఫోటోలు చూసిన చాలామంది రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోల్లో త్రిష వెకేషన్ కి వెళ్ళినట్లుగా ఉంది. దీంతో హీరో విజయ్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళినట్లుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: