గ్లామర్ రోల్స్ విషయంలో హద్దు దాటని కీర్తి సురేష్.. అందుకే మహానటి అంటూ?

Reddy P Rajasekhar

సినిమా రంగంలో హీరోయిన్లు పోషించే పాత్రలను బట్టి కూడా వాళ్లపై అభిప్రాయం ఏర్పడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన పాత్రల ద్వారా మంచి పేరును సొంతం చేసుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. కీర్తి సురేష్ తన సినీ కెరీర్ లో తక్కువ సినిమాల్లోనే నటించినా ఆ సినిమాలతో సత్తా చాటారు. అయితే గ్లామర్ రోల్స్ విషయంలో హద్దు దాటకుండా కీర్తి సురేష్ వార్తల్లో నిలవడం గమనార్హం.
 
మహానటి సినిమాతో ఓవర్ నైట్ లో కీర్తి సురేష్ ఇమేజ్, రేంజ్ మారిపోయింది. మొదట సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ పర్ఫెక్ట్ కాదని విమర్శలు చేసిన వాళ్లే తర్వాత ఆ అభిప్రాయాన్ని మార్చుకోవడం జరిగింది. ప్రేక్షకుల్లో కీర్తి సురేష్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. కీర్తి సురేష్ చేతిలో ప్రస్తుతం తెలుగు ఆఫర్లు ఎక్కువగా లేకపోయినా ఇతర భాషల్లో మాత్రం ఎక్కువ సంఖ్యలోనే ఆఫర్లు ఉండటం గమనార్హం.
 
కీర్తి సురేష్ కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఎంచుకునే పాత్రల విషయంలో వైవిధ్యం చూపిస్తున్నారు. కీర్తి సురేష్ కు తెలుగులో స్టార్స్ కు జోడీగా పెద్దగా ఆఫర్లు రాకపోయినా వచ్చిన ఆఫర్లను మాత్రం ఆమె సద్వినియోగం చేసుకుంటున్నారు. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నా ఆ వార్తలు ఫేక్ అనే సంగతి తెలిసిందే.
 
కీర్తి సురేష్ కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ రాబోయే రోజుల్లో ఎన్నో సంచలన రికార్డులను ఖాతాలో వేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కీర్తి సురేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సత్తా చాటాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కీర్తిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: