ఎవ్వరు ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకున్న అనుపమ పరమేశ్వరన్..ఫ్యాన్స్ కన్నీళ్లు..!

Thota Jaya Madhuri
ఇది నిజంగా అనుపమ పరమేశ్వరన్ అభిమానులకి బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.  అనుపమ పరమేశ్వరణ్  అంటే అభిమానులకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఆమెను నమ్ముకుని ఆమెను ఫాలో అయ్యే ఫ్యాన్స్ కే కాదు సామాన్య జనాలకి కూడా అనుపమ అంటే చాలా చాలా ఇష్టం . ఎంతలా అంటే అనుపమ పేరును తమ ఛాతిపై పచ్చబొట్టుపొడిపించుకొని కొందరు ఏకంగా తమ పిల్లలకు అనుపమ అంటూ పేరు కూడా పెట్టుకోచ్చారు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి .


అయితే అనుపమ పరమేశ్వరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో చాలా చాలా పద్ధతిగా చాలా ట్రెడిషనల్ పాత్రలో నటించి మెప్పించింది.  చాలామంది కుర్రాళ్ళు అనుపమ ని ట్రెడిషనల్ పాత్రలో మెరిసిన కూడా బాగా లైక్ చేశారు . మలయాళీ బ్యూటీనే అయిన నీ కట్టు బొట్టు అంతా అచ్చం తెలుగమ్మాయిలానే ఉంది అని.. మీకు ఇండస్ట్రీలో మంచి స్టార్ స్టేటస్ దక్కుతుంది అంటూ ఆమెను ఓ రేంజ్ లో పొగిడేసారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ గా నటించడం ప్రారంభించింది . డిజే టిల్లు 2 సినిమాలో ఏకంగా లిప్ లాక్ సీన్ కూడా చేసేసింది .


అంతకుముందు రౌడీ బాయ్స్ సినిమాలో యంగ్ హీరోతో ఘాటు రొమాన్స్ చేసింది. అయితే అనుపమ పరమేశ్వరణ్ చేసిన రొమాన్స్ ఆమె అభిమానులకి అస్సలు నచ్చలేదు . అందుకే ఓ అభిమాని ఏకంగా సెల్ఫీ వీడియోతో అనుపమ పరమేశ్వరణ్ కి "దయచేసి ఇలాంటి రోల్స్ ఇంకోసారి చేయొద్దు" అంటూ చెప్పుకొచ్చాడు . అయితే తాజాగా అనుపమ పరమేశ్వరణ్ మరొక బోల్డ్ సినిమాకి కమిట్ అయినట్లు ఇండస్ట్రీలో న్యూస్ తెగ వైరల్ గా మారింది.


అనుపమ పరమేశ్వరణ్ అంటే పద్ధతికి కేరాఫ్ అడ్రస్.. అనుకునే అభిమానులు ఆమె తీసుకున్న నిర్ణయం చూసి షాక్ అయిపోతున్నారు. ఎందుకు అనుపమ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావ్ అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఇది ఒక వేశ్య జీవితానికి సంబంధించిన కథ అనుసారంగా తెరకెక్కుతుంది అని .. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్  వేశ్య లా కనిపించబోతుంది అని అలాగే ఘాటు రొమాన్స్ కూడా చేయబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది . దీంతో కొంతమంది అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.  అనుపమ ఇలాంటి రోల్ నీకు అవసరమా అంటూ మండిపడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: