సినిమా లవర్స్ కి గుడ్ న్యూస్.. ఏకంగా అంత తక్కువ ధరకు సినిమా చూసే అవకాశం..?

MADDIBOINA AJAY KUMAR
ఈ మధ్య కాలంలో చాలా శాతం జనాలు మీడియం రేంజ్ సినిమాల కంటే చిన్న సినిమాల పైన కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోలు నటించిన సినిమాలకు భారీ ఎత్తున కలెక్షన్లు వస్తున్న మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలు మాత్రం పెద్ద స్థాయిలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపడం లేదు. ఇక మీడియం రేంజ్ హీరోల సినిమాల కంటే కూడా చిన్న స్థాయి హీరోలు నటించిన సినిమాలకే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఆదరణ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఈ మధ్య కాలంలో ఎన్నో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
 

ఇకపోతే తాజాగా లవ్ రెడ్డి అనే ఓ చిన్న సినిమా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ చిన్న సినిమాకు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు మరింత మంది రావాలి అనే ఉద్దేశంతో ఈ మూవీ యొక్క టికెట్ ధరను చాలా వరకు తగ్గించారు. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా యొక్క టికెట్ ధరను 112 రూపాయలుగా డిసైడ్ చేస్తూ అధికారికంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఎవరైనా ఈ సినిమాను చూడాలి అనుకుంటే చాలా తక్కువ ధరకే థియేటర్లలో చూడవచ్చు.

ఇకపోతే ఇలా టికెట్ ధరలు భారీగా తగ్గించడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకులు మొక్కు చూపే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. ఈ సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గించడం వల్ల ఈ సినిమాకు వచ్చే జనాల సంఖ్య పెరిగే అవకాశం చాలా వరకు ఉంది. అలా పెరిగి మంచి టాక్ కనుక వచ్చినట్లయితే ఈ మూవీ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. మరి లవ్ రెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో ... ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: