డ్యూయల్ రోల్ లో మాస్ ఫ్యాన్స్ ను మెప్పించిన చరణ్.. ఆ సీన్ లో అదరగొట్టాడుగా!

Reddy P Rajasekhar
 
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించి విడుదలైన ఏకైక సినిమా నాయక్ అనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమాలో సైతం చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నా ఈ సినిమా రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. 2024 సంవత్సరం సంక్రాంతి రేసులో గేమ్ ఛేంజర్ నిలిచిన సంగతి తెలిసిందే. చరణ్ డ్యూయల్ రోల్ లో నటించిన నాయక్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
 
ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్లుగా నటించడం జరిగింది. ఈ ఇద్దరు హీరోయిన్లు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించిందని చెప్పవచ్చు.
 
సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది. ఇంటర్వెల్ సీన్ లో రామ్ చరణ్ ఎంట్రీ అదిరిపోయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ సినీ కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో నాయక్ సినిమా ఒకటి. ఈ సినిమాలో రామ్ చరణ్ కామెడీ టైమింగ్ కు సైతం ఎంతోమంది అభిమానులు అయితే ఉన్నారనే సంగతి తెలిసిందే.
 
భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్న రామ్ చరణ్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు రెండున్నర సంవత్సరాల సమయం కేటాయించిన చరణ్ ఈ సినిమాతో భారీ హిట్ అందుకుంటానని నమ్ముతున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా పెద్దగా పోటీ లేకుండా రిలీజ్ అవుతుండటం గేమ్ ఛేంజర్ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకోవడం ద్వారా కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారనే సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: