రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో..?

Pandrala Sravanthi
 శుభ ముహూర్తాలు రావడంతో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెబుతూ అందరికి షాక్ ఇస్తున్నారు.అయితే మరి కొంతమందేమో సీక్రెట్ గా పెళ్లి చేసుకుని పెళ్లి అయిన కొద్ది రోజులకి ఈ విషయాన్ని బయటపెడుతున్నారు.అలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు రహస్యంగా పెళ్లిళ్లు చేసుకున్నవాళ్ళు ఉన్నారు. అయితే తాజాగా మరో హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈ హీరో ఆగస్టులోనే నిశ్చితార్థం జరుపుకొని అక్టోబర్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.. మరి ఇంతకీ రహస్యంగా పెళ్లి చేసుకున్న ఆ టాలీవుడ్ హీరో ఎవరయ్యా అంటే.. నటుడు విశ్వంత్ అనే పేరు చెబితే చాలామందికి తెలియదు. కానీ ఆయన ఫేస్ చూస్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ముఖ్యంగా యూత్ కి ఎంతో ఇష్టం అయినటువంటి కేరింత మూవీ అందరూ చూసే ఉంటారు. 

ఈ సినిమాలో సిద్ధార్థ్ పాత్రలో నటించిన విశ్వంత్ అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తాడు. ఈ మూవీలో హీరోయిన్ తేజస్వి మదివాడ లవర్ గా గిటార్ వాయించడం అంటే ఎంతో ఇష్టంగా ఉండే పాత్రలో నటించారు.అయితే అలాంటి నటుడు విశ్వంత్ కేవలం కేరింత మూవీలోనే కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్, జెర్సీ, మనమంతా, ఓ పిట్ట కథ, హైడెన్ సీక్, కథ వెనుక కథ వంటి సినిమాల్లో నటించారు. అయితే ఈయనకు కేరింత, మనమంతా,ఓ పిట్టకథ వంటి సినిమాలు మాత్రమే మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.

అయితే అలాంటి హీరో విశ్వంత్ భావన అనే అమ్మాయిని పెళ్లాడారు. అయితే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే చాలా సింపుల్ గా తన పెళ్లిని కానిచ్చేసారు. ఆగస్టులోనే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది.ఇక అక్టోబర్ లో ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక విశ్వంత్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా లో కూడా ఓ కీలక పాత్రలో చేస్తున్నట్టు తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: