ప్రభాస్ కు రాజమౌళిని మించిన కండిషన్ పెట్టిన సందీప్ రెడ్డి వంగ.. ఏం చెప్పాడంటే?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచం మొత్తం పాకి పోయేలా చేసిన దర్శకుడు రాజమౌళి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్ బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అని చెబుతూ ఉంటారు సినీ పండితులు. ఎందుకంటే జక్కన్న దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి సినిమా అంత పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన పార్ట్ 2 కూడా సంచలన విజయాన్ని సాధించి ఇక వరల్డ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది.

 ఇక ఈ సినిమా తర్వాత త్రిబుల్ ఆర్ లాంటి మరో మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజమౌళి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి ఒక సినిమా చేస్తున్నాడు అంటే హీరోల విషయంలో కొన్ని కండిషన్లు పెడతాడు అన్న విషయం అందరికీ తెలుసు. తన సినిమాల్లో నటించే హీరోలు ఎవరు తన సినిమా చేసినంత కాలం మరో సినిమాలో నటించకూడదు అని కండిషన్ పెడతాడు. ఇది ఎవరో అనుకోవడం కాదు రాజమౌళి డైరెక్షన్లో చేసిన కొంతమంది హీరోలు కూడా చెప్పేశారు. అయితే గతంలో ప్రభాస్ కి కూడా ఇలాంటి కండిషన్ పెట్టాడు రాజమౌళి.

 అయితే ఇక ఇప్పుడు అదే ప్రభాస్ కి రాజమౌళిని మించిన కండిషన్ పెట్టాడట మరో డైరెక్టర్. ఆయన ఎవరో కాదు సందీప్ రెడ్డి వంగ. తీసింది కొన్ని సినిమాలే అయినా సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు ఆయన. అయితే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ సినిమాకు సంబంధించిన ప్రకటన మూడేళ్ల కిందటే వచ్చింది. ఇక ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కాగా ఈ సినిమా విషయంలో ప్రభాస్ కి ఒక కండిషన్ పెట్టాడట డైరెక్టర్ సందీప్. తన డైరెక్షన్ లో నటించే సమయంలో తన సినిమాలో మాత్రమే నటించాలని షరతు విధించాడు అంటూ ఒక టాక్ వినిపిస్తోంది. ఇక మరో నాలుగైదు నెలల తర్వాత స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా అప్పటి నుంచి వేరే సినిమాలకు ప్రభాస్ దూరంగా కాబోతున్నారట. అయితే ఈ విషయం తెలిసి సందీప్ జక్కన్నను మించిన ట్విస్ట్ ఇచ్చాడు గా అంటూ నేటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: