యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజుల క్రితం దేవర పార్ట్ 1
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇకపోతే ఈ
సినిమా సౌత్
ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సినిమాలలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో టాప్ 10 లోకి మాత్రం రాలేకపోయింది. కానీ ఆ లిస్టు లోకి రావడానికి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో ప్రయత్నాలు చేస్తుంది.
బాహుబలి 2
సినిమా 1810 కోట్ల కలెక్షన్లతో సౌత్ నుండి అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో ఉండగా , ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్
మూవీ 1290 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలోనూ , కే జి ఎఫ్ చాప్టర్ 2
మూవీ 1233 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలోనూ , ఆ తర్వాత
కల్కి 2898 AD
సినిమా 1061.50 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలోనూ , రోబో 2.0
సినిమా 709 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలోనూ , సలార్ 630.15 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలోనూ , జైలర్
మూవీ 606.30 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలోనూ ,
బాహుబలి పార్ట్ 1
మూవీ 605 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలోనూ , లియో
మూవీ 600.60 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలోనూ , పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1
మూవీ 487.50 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానం లోనూ , ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం
మూవీ 453 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలోనూ , దేవర పార్ట్ 1
మూవీ 22 రోజుల్లో 436 కోట్ల కలెక్షన్లతో 11 స్థానంలో ఉంది. మరి రాబోయే రోజుల్లో దేవర
సినిమా ఈ లిస్టులో మరింత ముందుకు వెళుతుందేమో చూడాలి.