తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో నిర్మాతగా నిర్మించిన దాదాపు అన్ని సినిమాలు
బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. కానీ 2022 వ సంవత్సరం నుండి మాత్రం దిల్ రాజు కు చాలా సినిమాల ద్వారా ఎదురు దెబ్బలు తగిలాయి. మరి ఈయన 2022 వ సంవత్సరం నుండి ఇన్వాల్వ్ అయిన సినిమాలలో ఏ సినిమాలు ఇలాంటి విజయాలను అందుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
దిల్ రాజు కొంత కాలం క్రితం రౌడీ బాయ్స్ అనే సినిమాను నిర్మించిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల ఈ
సినిమా పెద్ద స్థాయి విజయాన్ని ఏమీ అందుకోలేదు. దిల్ రాజు "గుడ్ లక్ సఖి" అనే సినిమాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. కొంత కాలం క్రితం దిల్ రాజు ఎఫ్ 3 అనే సినిమాను నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగింది. థాంక్యూ సినిమాను దిల్ రాజు నిర్మించగా ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. వారిసు సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్లో నిర్మించగా ఈ
మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
ఇక దిల్ రాజు నిర్మించిన బలగం
సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. శాకుంతలం
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ది ఫ్యామిలీ స్టార్
మూవీ కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.
లవ్ మీ
సినిమా కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. తాజాగా దిల్ రాజు "జనక అయితే గనక" అనే సినిమాను నిర్మించాడు. ఈ
మూవీ ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.