ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉండగా ..కేవలం నాగార్జునను మాత్రమే అలా ఎందుకు పిలుస్తారో తెలుసా..?

Thota Jaya Madhuri
ఇండస్ట్రీలో ఒక్కో హీరో కి ఒక్కో ట్యాగ్ ఉంటుంది . అది జనాలు ఇస్తూ ఉంటారు . కొన్ని సార్లు డైరెక్టర్లు ఇస్తూ కూడా ఉంటారు . అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు . స్టార్లుగా మారారు . పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ కూడా సంపాదించుకున్నారు . ఇప్పటివరకు రొమాంటిక్ హీరో అంటే మాత్రం అందరికీ మొదటిగా గుర్తిచ్చేది నాగార్జున . మన్మధుడుగా ట్యాగ్ చేయించుకొని ఏజ్ పైబడి పోతున్న సరే ఇప్పటికి అమ్మాయిలా మనసులను దోచేస్తున్నాడు . నాగార్జున లుక్స్ చూస్తే అసలు ఆయన వయసుని గెస్ చేయడం చాలా చాలా కష్టం.

 
పెళ్లి కావాల్సిన అమ్మాయిలు అదేగా పెళ్లయిపోయిన ఆంటీలు కూడా నాగార్జునను చూసి ఫిదా అయిపోతూ ఉంటారు . అలాంటి హ్యాండ్సమ్ లుక్స్ ను దక్కించుకున్నాడు నాగార్జున.  అయితే ఎందుకు నాగార్జునకు మాత్రమే రొమాంటిక్ హీరో అనే ట్యాగ్ వేశారు..? హీరోయిన్స్ కూడా నాగార్జునతో అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు ..? అనేది ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ , వెంకటేష్ లకు ఎందుకు ఆ రొమాంటిక్ హీరో అనే ట్యాగ్ రాలేదు అంటూ చర్చించుకుంటున్నారు .


కాగా మొదటి నుంచి నాగార్జున చాలా సరదా సరదాగా ఉండేవాడట. అంతేకాదు అలాంటి సినిమాలనే చూస్ చేసుకుంటూ వచ్చాడట . మరీ ముఖ్యంగా "నిన్నే పెళ్లాడుతా" సినిమా టైం నుంచి ఆయన ఎక్కువగా అలాంటి రొమాంటిక్ సీన్స్ లో నటించడం మొదలుపెట్టాడట . అంతకుముందు కొన్ని సినిమాలలో  అలాంటి సీన్స్ లో నటించిన.. నిన్నే పెళ్లాడుతా లో ఆయన ఎంతలా టబుతో రెచ్చిపోయినటించారో చూసాం . అప్పుడే జనాలు నాగార్జునను రొమాంటిక్ హీరో అంటూ పిలవడం మొదలుపెట్టారు . అది అలా అలా కంటిన్యూ అవుతూ మన్మధుడు సినిమాతో కూడా మరింత బలంగా మారిపోయింది . ఇప్పుడు ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరో అంటే మాత్రం మొదటగా అందరు చెప్పే పేరు నాగార్జున నే.. ఇప్పటికీ రొమాంటిక్ సీన్స్ లో నటిస్తూ అందరినీ షాకింగ్ కి గురి చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: