రీసెంట్ టైం లో సినిమాను ఎంత బాగా తీశాము అనే దాని కంటే కూడా సినిమాను ఎంత బాగా ప్రమోట్ చేసాము అనేది అత్యంత కీలకమైన అంశంగా మారిపోయింది. సినిమాను అద్భుతంగా తీసి కూడా ప్రచారాలను సరిగ్గా చేయనట్లయితే సినిమాకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇక సినిమాను యావరేజ్ గా తీసిన ప్రమోషన్లను అద్భుతంగా చేసినట్లయితే ఆ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సినిమాను అద్భుతంగా తీసి ప్రచారాలను కూడా అదే స్థాయిలో నిర్వహించినట్లయితే ఆ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
దానితో ఈ మధ్య కాలంలో చాలా మంది సినిమా షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాక చాలా కాలాన్ని ప్రచారాలకు కేటాయిస్తున్నారు. అందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో ప్రమోషన్లను చేస్తూ వస్తున్నారు. ఇకపోతే కొంత కాలం క్రితం రవితేజ "మిస్టర్ బచ్చన్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందు హైదరాబాదులోని మెట్రో రైల్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను చేశారు. ఇకపోతే తాజాగా సాహిత్ మోతుకూరి దర్శకత్వంలో యువ చంద్ర హీరోగా అనన్య నాగళ్ళ హీరోయిన్గా పొట్టేల్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని అక్టోబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ప్రచారాలను పెద్ద ఎత్తున చేస్తుంది. ఇక ఈ మూవీ లో హీరోయిన్గా నటించిన అనన్య నాగళ్ళ ఫ్లైట్ లో ఈ సినిమా ప్రచారాలను నిర్వహిస్తుంది. ఇక అనన్య నిర్వహించిన ఈ డిఫరెంట్ ప్రచారాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ స్థాయిలో ప్రచారాలను నిర్వహించడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.