దేవర చేతికి మరో రికార్డు.. మూడవ వారంలో టాప్ 5 ఆ ప్లేస్లో..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ మూవీ మూడవ వారం బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీ ల లిస్టులో దేవర పార్ట్ 1 సినిమా అద్భుతమైన స్థానాన్ని దక్కించుకుంది. మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టు లో బాహుబలి 2 సినిమా 18.20 కోట్ల షేర్ కలెక్షన్లతో మొదటి స్థానంలో నిలవగా , ఆ తర్వాత హనుమాన్ సినిమా 16.01 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో నిలిచింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ విడుదల అయిన మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.92 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి విడుదల అయిన మూడవ వారం అత్యధిక షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన సినిమాల లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ 12.31 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో నిలవగా , కల్కి 2898 AD సినిమా 10.58 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో నిలిచింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మూడవ వారం అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 12.92 కోట్ల కలెక్షన్లతో దేవర పార్ట్ 1 మూవీ మూడవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: