రీరిలీజ్ లతో ప్రభాస్ సంచలన రికార్డ్.. ఎప్పటికీ బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదుగా!

Reddy P Rajasekhar
స్టార్ హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రభాస్ తన టాలెంట్ తో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రభాస్ పుట్టినరోజు అభిమానులకు పండుగ రోజు కాగా మరికొన్ని రోజుల్లో ప్రభాస్ పుట్టినరోజు ఉండటంతో ఫ్యాన్స్ ఈ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.
 
రీరిలీజ్ లతో ప్రభాస్ సంచలన రికార్డ్ లను ఖాతాలో వేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఏడాది ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఏకంగా 6 సినిమాలు రీరిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. సాధారణంగా ఏ హీరో పుట్టినరోజు అయినా ఒకటి లేదా రెండు సినిమాలు రీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు రీరిలీజ్ కావడం అంటే సరికొత్త రికార్డ్ అనే చెప్పాలి.
 
ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్, రెబల్, సలార్ సినిమాలు పుట్టినరోజు కానుకగా రీరిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. ఒక హీరో పుట్టినరోజు కానుకగా ఇన్ని సినిమాలు రిలీజ్ కావడం అంటే సాధారణ విషయం కాదనే సంగతి తెలిసిందే.
 
ప్రభాస్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉండగా ప్రభాస్ పుట్టినరోజు కానుకగా వచ్చే అప్ డేట్స్ గురించి సైతం అభిమానుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో సంచలనాలు క్రియేట్ చేయనున్నారో చూడాలి. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో అభిమానులకు ఎంతగానో దగ్గరవుతున్నారు. ప్రభాస్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: