మంచు విష్ణు కన్ఫ్యూజన్ !

Seetha Sailaja
మంచు ఫ్యామిలీ వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన విష్ణు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు దాటిపోతున్నా అతడి కెరియర్ కు సంబంధించి ది బెస్ట్ అని చెప్పుకోతగ్గ మూవీ ఒక్కటి కూడ లేకపోవడంతో ఆలోటును తీర్చుకోవాలని భారీ బడ్జెట్ తో ‘కన్నప్ప’ మూవీని నిర్మిస్తూ అందులో కన్నప్పగా నటిస్తున్నాడు. సినిమా మొత్తం న్యూజీలాండ్ పరిసరాలలో నిర్మించిన విషయం తెలిసిందే.

ఈమూవీ డిసెంబర్ రిలీజ్ అంటూ ఒక టీజర్ ఆమధ్య విడుదల చేశారు. ఆ టీజర్ మిశ్రమ స్పందన వచ్చింది. డిసెంబర్ నెల దగ్గర పడుతున్న నేపధ్యంలో భారీ సినిమాలు అన్నీ తమ రిలీజ్ డేట్స్ ను ప్రకటించడమే కాకుండా పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్ కూడ మొదలు పెడుతున్నారు. డిసెంబర్ 20న విడుదల కావలసి ఉన్న ‘గేమ్ ఛేంజర్’ వాయిదా పడటంతో ఆ డేట్ కు విష్ణు ‘కన్నప్ప’ వస్తుంది అని ఎదురు చూశారు. అయితే ఈ విషయమై విష్ణు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు. దీనితో కన్నప్పకు ఏమైంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ఈమూవీకి మంచు విష్ణు ఊహించిన స్థాయిలో బయ్యర్ల నుండి భారీ స్థాయిలో స్పందన రావడంలేదు అని అంటున్నారు. ఈమూవీ దర్శకుడుకి పెద్దగా పేరు లేకపోవడంతో పాటు ప్రస్తుతంవిష్ణు మార్కెట్ అంతంత మాత్రంగా ఉండటంతో ఈమూవీకి మార్కెట్ పరంగా సమశ్యలు ఎదురౌవుతున్నాయి అన్న రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈమూవీలో ప్రభాస్ అక్షయ కుమారు మోహన్ లాల్ లాంటి టాప్ హీరోలు అతిధి పాత్రలో నటించిన నేపధ్యంలో ఈమూవీ మార్కెట్ కు సమస్యలు ఉండవని విష్ణు నమ్మకం అన్న మాటలు వినిపిస్తున్నాయి..

ఈమధ్య కాలంలో ప్రేక్షకుల ఆలోచనలు మారిపోవడంతో వాస్తవ సంఘటనలు ఆధారంగ వచ్చిన సినిమాలను సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ సినిమాలను బాగా ఆదరిస్తున్న పరిస్తులలో విష్ణు చెప్పబోయే భక్త కన్నప్ప కధను ఎంతవరకు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తారు అన్నది వేచి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: