బ‌న్నీ సినిమా.. దారుణంగా మోస‌పోయిన శ్ర‌ద్ధాదాస్‌.. అస‌లేం జ‌రిగింది..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
బన్నీ సినిమా ఏమిటి..? హీరోయిన్ శ్రద్ధాదాస్ మోసపోవడం ఏంటి..? అని అనుకుంటున్నారా. బన్నీ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో శ్రద్ధాదాస్ కూడా నటించింది. ఇదే విషయాన్ని శ్రద్ధాదాస్ చాలా సందర్భాలలో చెప్పింది. బన్నీ సినిమా అనగానే ఒక్కసారిగా ఎగిరి గంతేసిందట శ్రద్ధాదాస్. అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ సినిమా హిట్ అయ్యాక వరుసగా కొత్త ఆఫర్లు ఆమెకు వచ్చాయి. అయితే స్టార్ హీరోయిన్గా మాత్రం ఆమె ఎదగలేదు. అదేంటో గాని అల్లరి నరేష్ సరసన హీరోయిన్గా నటిస్తూ ఇండస్ట్రీకి పరిచయం అయినా ఏ అమ్మాయి కూడా.. అంతగా సక్సెస్ కాలేదు. పట్టుమని పది సినిమాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరు. శ్రద్ధాదాస్ పరిస్థితి కూడా అంతే. హీరోయిన్గా పది సినిమాలు కూడా చేసింది లేదు. ఇక కొన్ని సినిమాలు తను ఎందుకు చేశానో అని.. శ్రద్ధ బాధపడిన సందర్భాలు ఉన్నాయట.

అలా బాధపడిన సినిమా ఆర్య 2. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో.. శ్రద్ధాదాస్ గ్లామర్‌కి ఆడియన్స్ బాగా ఎట్రాక్ట్ అయ్యారు. కానీ కాస్ట్‌లీ వ్యాంపు తరహాలో ఉండే శ్రద్ధాదాస్ క్యారెక్టర్ ఆమెకు అంతగా పేరు తెచ్చి పెట్టలేదు. పైకి అంత గ్లామర్ గా నటించిన.. ఎటు తిరిగి సినిమాలో క్రెడిట్ దక్కింది మాత్రం కాజల్‌కు మాత్రమే. సుకుమార్.. శ్రద్ధాదాస్ క్యారెక్టర్ ని అంత స్ట్రాంగ్ గా రాసుకోలేదు. ఏదో అందాలు ఆరబోయటానికి ఓ అమ్మాయి కావాలి.. ఫిజిక్ శ్రద్ధాదాస్‌ది అయితే బాగుంటుంది అన్నట్టుగానే ఆమెను పెట్టారు. ఆర్య 2 తర్వాత శ్రద్ధాదాస్ కెరీర్ ఏమాత్రం పుంజుకోలేదు. అలా ఆమె టాలీవుడ్ నుంచి ఫెడవుట్ అయిపోయింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: