రకుల్ రిజెక్ట్ చేసింది.. సాయి పల్లవి బ్లాక్ బస్టర్ కొట్టింది.. ఆ సినిమా ఏదో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
సినీ పరిశ్రమలో ఒకరు రిజెక్ట్ చేసిన పాత్రలో మరొకరు నటించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒకరు రిజెక్ట్ చేసిన తర్వాత ఆ పాత్రను వేరే వారు చేశాక ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న లేదా ఆ సినిమాలోని ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చిన ఆ తర్వాత రిజెక్ట్ చేసిన వారు ఎందుకు ఆ సినిమాను ఆ టైం లో వదిలి పెట్టమా అని బాధపడతారు. ఇక వారు రిజెక్ట్ చేసిన పాత్ర కైనా , సినిమా కైనా మంచి గుర్తింపు రాలేదు అంటే ఆ రోజు ఆ సినిమాను రిజెక్ట్ చేసి చాలా మంచి చేశాం అని కూడా అనుకుంటూ ఉంటారు.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ బ్లాక్ బస్టర్ మూవీ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ మూవీ ఏది అనే వివరాలను తెలుసుకుందాం. కొంత కాలం క్రితం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్గా లవ్ స్టోరీ అనే మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా లోని సాయి పల్లవి నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ లో మొదట సాయి పల్లవి పాత్రకు శేఖర్ కమ్ముల రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నాడట. అందులో భాగంగా ఆమెను కూడా సంప్రదించాడట. కానీ అప్పుడు రకుల్ ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. దానితో శేఖర్ , సాయి పల్లవి ని సంప్రదించడం , ఈ మూవీ కథను చెప్పడం , ఆ తర్వాత ఆమెకు కూడా ఈ కథ నచ్చడంతో ఈ సినిమాలో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: