టాలీవుడ్
ఇండస్ట్రీ లో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్ ఈ మధ్య కాలంలో మాత్రం మంచి విజయాలను అందుకోవడం లేదు. కెరియర్ ప్రారంభంలో హీరోగా నటించి మొదటి సినిమాతో అపజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత విలన్ పాత్రలలో నటించి సూపర్
సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ
హీరో గా కెరియర్ టర్న్ తీసుకున్న ఈయన అక్కడ కూడా సూపర్
సక్సెస్ అయ్యాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం గోపీచంద్ సరైన విజయాలను అందుకోవడంలో చాలా వెనుకబడిపోయాడు.
జిల్ మూవీ దగ్గర నుండి గోపీచంద్ చాలా అపజాయలను అందుకుంటూ వస్తున్నాడు.
జిల్
సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది. ఆ తరువాత సౌఖ్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ కు ఆ సినిమాతో ఫ్లాప్ దక్కింది. ఇక ఆ తర్వాత
గౌతమ్ నంద
సినిమా బాగానే ఉన్నప్పటికీ ఆ సమయంలో ఈ
సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ
సినిమా కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత
ఆక్సిజన్ సినిమాతో కూడా గోపీచంద్ ఫ్లాప్ ను అందుకున్నాడు. ఇక పంతం
సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది.
చాణక్య మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. సిటీమార్
సినిమా మాత్రం కాస్త మంచి విజయాన్ని అందుకుంది.
ఆరడుగుల బుల్లెట్టు పక్కా , కమర్షియల్ , రామబాణం సినిమాలు వరుసగా ఫ్లాప్ లు అయ్యాయి. ఇక బీమా
సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. తాజాగా గోపీచంద్ హీరోగా రూపొందిన విశ్వం
సినిమా ధియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ
సినిమా కూడా భారీ స్థాయి కలెక్షన్లను రాబట్టడం లేదు. మరి ఈ సినిమాతో గోపీచంద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.