పెళ్లయిన 12 ఏళ్లకు తల్లి కాబోతున్న బాలయ్య బ్యూటీ..?

Pandrala Sravanthi
బాలకృష్ణ హీరోగా చేసిన లయన్, లెజెండ్ వంటి సినిమాల్లో బాలకృష్ణతో జతకట్టిన బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే అంటే అందరికీ తెలిసిన హీరోయినే.ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్, మరాఠి, బెంగాలీ, తమిళ వంటి ఎన్నో భాషల్లో ప్రయోగాత్మక సినిమాల్లో నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ  2012 లోనే పెళ్లి చేసుకుంది. పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.అలాంటి ఈ బ్యూటీ ఎన్నో న్యూడ్ సినిమాల్లో కూడా నటించి బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక 2012లో బెండిక్ట్  టేలర్ ని పెళ్లాడింది. ఇక పెళ్లయి దాదాపు 12 సంవత్సరాలు అవుతున్న కూడా ఇప్పటివరకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ బేబీ బంప్ తో కనిపించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. 

తన ప్రెగ్నెన్సీ విషయాన్ని చాలా రోజులుగా రహస్యంగా ఉంచిన రాధిక ఆప్టే తాజాగా బేబీ బంప్ తో కనిపించేసరికి అందరూ ఈ హీరోయిన్ ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది అని షాక్ లో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి డెలివరీ డేట్ కూడా దగ్గరికి వచ్చేసిందని, నవంబర్లోనే బేబీకి జన్మనివ్వబోతుందని తెలుస్తోంది. ఇక రాధిక ఆప్టే ప్రస్తుతం సిస్టర్ మిడ్ నైట్ అనే తన కొత్త సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో ని లండన్ లో ప్రదర్శించగా అక్కడికి వెళ్ళింది. అయితే ఈ ఈవెంట్ లో భాగంగా రాధిక ఆప్టే బేబీ బంప్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

అలా రాధిక ఆప్టే తల్లి కాబోతుంది అనే విషయం తెలిసి ఆమె అభిమానులందరూ పెద్ద ఎత్తున ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక థియేటర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన రాధిక ఆప్టే ఎన్నో భాషల్లో హీరోయిన్ గా నటించిన తెలుగులో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రక్త చరిత్ర, రక్త చరిత్ర 2 వంటి సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత ధోని,లెజెండ్, లయన్, కబాలి వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి సౌత్ లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: