టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో రాజా వారు రాణి గారు , ఎస్ ఆర్ కళ్యాణ మండపం , సమ్మతమే , వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఈయన నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే ఈయన ఆఖరుగా రూల్స్ రంజన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.
ఈ సినిమా తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న ఈ నటుడు తాజాగా "క" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక నిన్న ఓ ఈవెంట్లో భాగంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ... ఈ సినిమాను తెలుగు తో పాటు మిగతా నాలుగు భాషల్లో కూడా ఒకే తేదీన విడుదల చేయాలి అనుకున్నాం. కానీ తమిళ్లో మాత్రం అది కుదిరే అవకాశం కనిపించడం లేదు ... కానీ ప్రయత్నిస్తాం అని చెప్పాడు. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ తేదీన ఇప్పటికే అనేక సినిమాలువిడుదల కావడానికి రెడీగా ఉన్నాయి.
మరి అంత పోటీలో ఈయన "క" సినిమాను విడుదల చేయడానికి డిసైడ్ అయ్యాడు. అంటే కొంత మంది అనవసరంగా కిరణ్ రిస్క్ చేస్తున్నాడు అంటే , మరి కొంత మంది మాత్రం సినిమా కంటెంట్ లో దమ్ము ఉండి ఉంటుంది అందుకే ఆయన అంత ధైర్యం చేసే ముందుకు వస్తున్నాడు అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి కిరణ్ "క" మూవీ తో ఏ స్థాయి సక్సెస్ను అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.