పెళ్ళై ఓ కొడుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ బ్యూటీ..?

Pandrala Sravanthi
ఏంటి ఈ బిగ్ బాస్ బ్యూటీ నిజంగానే పెళ్ళై ఓ బాబున్న పిల్లాడిని పెళ్లి చేసుకుంటుందా.. ఎందుకు అలా చేస్తోంది.. ఈమెకు ఏం తక్కువ అని చాలామంది నెటిజన్లు ఈ బ్యూటీ తీసుకునన్న నిర్ణయం చూసి తిట్టుకుంటున్నారు. ఇక పెళ్లయి బాబున్న ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న ఆ బ్యూటీ ఎవరో కాదు నటి ఆకుల సోనియా.. రీసెంట్ గానే  బిగ్ బాస్ 8 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన కరీంనగర్ కి చెందిన ఆకుల సోనియా ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా బిగ్ బాస్ లో ఎక్కువగా నెగెటివిటీ మూట గట్టుకొని హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. ఇక ఈ బ్యూటీ నిఖిల్ తో నడిపించిన వ్యవహారం మామూలుగా ఉండేది కాదు. కానీ బయటికి వచ్చాక మాత్రం బిగ్ బాస్ నన్ను తప్పుగా చూపించారని, నన్ను పూర్తిగా బ్యాడ్ చేశారని, బయట చూసిన వాళ్ళందరూ బిగ్ బాస్ లో నన్ను చూపించిన తీరుని చూసి నా క్యారెక్టర్ గురించి ఏమనుకోవాలి అంటూ బిగ్ బాస్ పై ఫైర్ అయింది. అలాగే నాగార్జునని కూడా ఈ ఇష్యూలోకి తీసుకువచ్చి నాగార్జున పై కూడా ఫైర్ అయింది. 

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనియాకి షాకింగ్ ప్రశ్న ఎదురైంది.మీరు ఇంత ఏజ్ వచ్చాక ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు.అలాగే మీరు రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకోబోతున్నారు అనే రూమర్లు వినిపిస్తున్నాయి. అవి నిజమేనా అని యాంకర్ అడగగా..అవును మీరు వినేది నిజమే. అవి రూమర్లు కాదు.యష్ కి ఇంతకుముందే పెళ్ళైంది.అంతే కాదు ఒక బాబు కూడా ఉన్నాడు అంటూ ఒక షాకింగ్ విషయాన్ని సోనియా బయట పెట్టింది.

 ఇక యష్ తనకి ఫైనాన్షియల్ గా పొటెన్షియల్ గా చాలా సపోర్ట్ ఇచ్చాడని,అందుకే తనకి కనెక్ట్ అయిన నేను ముందే పెళ్లయి విడాకులు అయ్యాయి బాబు ఉన్నాడు అనే విషయం తెలిసిన కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను అంటూ ఆకుల సోనియా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఆకుల సోనియా మాట్లాడిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ డబ్బుంది కాబట్టి రెండో పెళ్లి అయితే ఏంటి బాబు ఉంటే ఏంటి డబ్బులు చూసే పెళ్లి చేసుకుంటుంది అని కొంతమంది కామెంట్స్ పెడితే మరికొంత మందేమో సోనియాకి కూడా అంతకుముందే పెళ్లయి విడాకులు అయ్యాయి. అందుకే రెండో పెళ్లి వాడిని చేసుకోవడానికి రెడీ అయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: