నిర్మాతలు భయపడుతున్నారు.. ప్రేక్షకుడిని భయపెడుతున్నారు?
దీనికి తోడు మిగతా తారాగణం కూడా ఇలా కోట్లలో పారితో సుఖం తీసుకుంటున్నారు. దానికి తోడు ఇక కథ కంటెంట్ ను నమ్మి సినిమా తీయడం మానేసి.. కేవలం విఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ ని నమ్మి దర్శక నిర్మాతలు సినిమా తీస్తూ భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇవన్నీ కలుపుకొని ఒక్కో సినిమాకి రెండు నుంచి మూడు వందల కోట్లు అవుతున్నాయి. ఇంకేముంది ఇక సినిమా విడుదలైన తర్వాత కంటెంట్ లేకపోయినా పెద్ద మొత్తం వసూలు చేయాలనే టార్గెట్ పెట్టుకుంటున్నారు. దీంతో సినిమా టికెట్ ధరలను అమాంతం పెంచేస్తున్నారు.
ఇక రెండు మూడు వందల కోట్ల బడ్జెట్ పెట్టిన నిర్మాతలకు నష్టాలు వస్తే తమ పరిస్థితి ఏంటి అని ఎలాగో ఒక భయం పట్టుకుంటుంది. అందుకే గవర్నమెంట్ లను రిక్వెస్ట్ చేసి మరి సినిమా రేట్లు పెంచుతున్నారు. అయితే ఇలా భారీ బడ్జెట్ పెట్టి లాభాలు వస్తాయో లేదో.. కనీసం పెట్టిన పెట్టుబడి అయిన వస్తుందో లేదో అని భయపడిపోతున్న నిర్మాతలు.. చివరికి టికెట్ రేట్లు పెంచి ప్రేక్షకులను సైతం భయపెడుతున్నారు. దీంతో చాలీచాలని జీతం చేస్తూ కుటుంబ బాధ్యతలు నెట్టుకొస్తున్న ఒక సామాన్య ప్రేక్షకుడు.. ఇక పెరిగిపోయిన టికెట్ ధరలు నేపథ్యంలో థియేటర్కు వెళ్లి సినిమా చూడలేని పరిస్థితి ఏర్పడింది.ఇక రానున్న రోజుల్లో అయినా నిర్మాతలు ఈ విషయంపై దృష్టి సారించి సామాన్య ప్రేక్షకులకి అటు సినిమాను అందుబాటులోకి తీసుకువస్తారో లేదో చూడాలి.