టాలీవుడ్ : గత 15 సినిమాల్లో 2 హిట్లు ఉన్న హీరోకు రూ.20 కోట్ల రెమ్యునరేషనా..?
• చీప్ కంటెంట్ థ్రిల్స్, చీప్ ట్రిక్స్ తో ప్రేక్షకులను మోసం
• వందల కోట్లు వెనకేసుకుంటున్న హీరోలు
( ఏపీ - ఇండియా హెరాల్డ్)
ఒకప్పుడు తెలుగు సినిమా రూ.100 కోట్లు వసూలు చేయడమే పెద్ద గగనం అయిపోయేది కానీ ఇప్పుడు రూ.100 కోట్ల కలెక్షన్స్ అనేవి తెలుగు సినిమాకి చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. మిడ్ రేంజ్, టాప్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రూ.వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. దానికి కారణం ఫస్ట్ వీక్ లో టికెట్ రేట్లు భారీ ఎత్తున నిర్ణయించడమే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువ షోలు వేసుకోవడానికి ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. దీని కారణంగా ఎక్కువమంది ప్రేక్షకులు ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు కొనుగోలు చేస్తూ సినిమాల కలెక్షన్లు పెంచేస్తున్నారు.
ఇన్ని డబ్బులు వస్తున్నాయి కాబట్టి హీరోలు తమ రెమ్యునరేషన్ తెగ పెంచేస్తున్నారు. ఇంతకుముందు బడా హీరోల పారితోషికం రూ.12 నుంచి రూ.13 కోట్ల మధ్యలో ఉండేది కానీ ఇప్పుడు ఫ్లాప్ హీరోలు కూడా అంతకుమించి పారితోషికం తీసుకుంటున్నారు. ఒక హీరో అయితే గత 15 ఏళ్లలో ఎన్నో సినిమాలు తీశాడు. అందులో కేవలం రెండు మాత్రమే హిట్స్ అందుకున్నాడు. అయినా అతడు రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. తీసేవి చెత్త సినిమాలే. అయినా ఇతడికి ఎందుకు ఇంత డబ్బులు ఇస్తున్నారు? ఎందుకంటే నిర్మాతలు తెలివిగా ప్రేక్షకుల జేబుల నుంచి డబ్బు కాజేస్తున్నారు. అవే వీళ్లకు ఇస్తున్నారు.
సినిమా కంటెంట్ అంత గొప్పగా ఏమీ ఉండదు. సినిమా చూసినా ఎక్స్‌పీరియన్స్ ప్రేక్షకుడు పెట్టే డబ్బులకు న్యాయం చేయలేదు. రొటీన్ స్టోరీలు, పిచ్చి ఫైట్లు, తలనొప్పి తెప్పించే యాక్షన్ సీక్వెన్స్‌లు, కుప్పిగంతులు, కాపీల కిచిడి ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినిమా స్థాయి బాగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. థియేటర్లకు పోయి చూసే అంత గొప్పగా సినిమాలు ఉండటం లేదు కానీ కలెక్షన్లు మాత్రం బాగానే వసూలు చేస్తున్నారు. సరైన కంటెంట్ ప్రొడ్యూస్ చేసేంత టాలెంట్ లేక చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పిస్తున్నారు. అభిమానులను పిచ్చి వాళ్లని చేసి వారి నుంచి డబ్బులు లాగేసుకొని హీరోలు హాయిగా తమ సంపాదన పెంచుకుంటున్నారు. దర్శక నిర్మాతలు కూడా దీన్ని వ్యాపారం లాగా చూస్తున్నారు తప్పించి ఒక ఆర్ట్ లాగా చూడడం లేదు. ఆల్ ఇండియా లెవెల్ లో హిట్టు కొట్టి బాగా డబ్బులు వెనకేసుకోవాలని చూస్తున్నారు. అవసరం లేకపోయినా రెండు పార్ట్‌లు తీస్తూ డబ్బులు వెనకేసుకుంటున్నారు.
రూ.20-150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని అంతగా హీరోలు ఏం పొడుస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. రూ.50 కోట్లలో సినిమా వసూలు చేసి టికెట్ రేట్లు గరిష్టంగా 100 రూపాయలు పెడితే న్యాయంగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.