అనవసరంగా చేసి చెత్త రికార్డును మూటగట్టుకుంది.. జిగ్రా కి 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..?

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. ఈమె ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోయిన్గా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితం ఈ నటి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన గంగుబాయి ఖతియవాడి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆలియా కు ఈ సినిమా ద్వారా అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి లభించాయి. అలాగే ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలు గారు రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించింది. ఈ మూవీ లో ఈమె రామ్ చరణ్ కి జోడిగా నటించింది.

ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఆలియా బట్ "జిగ్రా" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ద్వారా ఆలియా భట్ ఒక చెత్త రికార్డును సృష్టించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆఖరి పదేళ్లలో ఆలియా భట్ నటించిన ఏ సినిమాకు కూడా ఈ మూవీ కి వచ్చినన్ని తక్కువ కలెక్షన్లు రాలేదు అని తెలుస్తుంది. ఈ మూవీ కి మొదటి రోజు 4.55 కోట్ల కలెక్షన్లు రాగా , రెండవ రోజు 6.55 కోట్లకు నెట్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ కాగా ఈ రెండు రోజుల్లో మాత్రమే ఈ మూవీ కి కాస్త మంచి కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం మాత్రం ఈ మూవీ కి భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు అని వార్తలు వస్తున్నాయి. లేకపోతే ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ప్రభావాన్ని చూపడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: