చిరంజీవి - శ్రీదేవి మెగా ఫాన్స్ ఎవర్ గ్రీన్ జోడి.. పెళ్లి చేసుకుంటే చూడాలనుకున్న ఫ్యాన్స్.. కానీ?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎంతోమంది హీరోలతో.. హీరోలు ఎంతో మంది హీరోయిన్లతో నటించడం చూస్తూ ఉంటాము. అయితే ఇలా ఇండస్ట్రీలో ఎన్ని కాంబినేషన్స్ రిపీట్ అయినప్పటికీ.. కొన్ని కాంబినేషన్స్ మాత్రం ప్రేక్షకులందరికీ ఫేవరెట్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు కూడా ఇలాంటి ఫేవరెట్ కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు 150 కి పైగా సినిమాల్లో నటించారు. ఇక ఆయా సినిమాల్లో చాలామంది హీరోయిన్లతో కాలు కదిపారు. కొంతమందితో రొమాన్స్ పరంగా కూడా కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ కూడా అయ్యింది.

 అయితే ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఆయన కెరియర్ లో ఎంతోమందికి హీరోయిన్లతో నటించినప్పటికీ..  శ్రీదేవితో మాత్రం బెస్ట్ జోడి అని పేరు సంపాదించుకున్నారు. ఈ ఇద్దరి జంట  కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు అని చెప్పాలీ. మరి ముఖ్యంగా వీరిద్దరూ కలిసి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా అయితే ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాణి కాసుల రంగమ్మ అనే సినిమాలో  మొదటిసారి జోడి కట్టింది ఈ ఇద్దరి జంట.

 మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి నటించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా అయితే ఏకంగా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఆ సమయంలో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. ఇండస్ట్రీలో సూపర్ హిట్ జోడిగా పేరు సంపాదించుకుంది శ్రీదేవి, చిరంజీవి జోడి. ఇక ఆ తర్వాత ఈ హిట్ జోడి మరోసారి ఎస్పీ పరశురామ్ అనే సినిమాలో కలిసిన నటించగా.. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దీంతో అభిమానుల గుండెల్లో ఈ జోడీకి ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఏకంగా వీరిద్దరికీ పెళ్లి జరిగితే చూడాలని కూడా మిమ్మల్ని కోరుకున్నారు ఫ్యాన్స్. కానీ అది కలగానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: