ప్లీజ్ ఆ ఛాన్స్ నాకివ్వండి.. 100 కోట్ల హిరోయిన్ కు ఆఫర్లు లేదా..?

shami
ఉప్పెన సినిమాతో తొలి సినిమానే సెన్సేషనల్ హిట్ అందుకుని 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది బేబమ్మ కృతి శెట్టి. ఐతే ఆ సినిమా సక్సెస్ లో ఆమె పెర్ఫార్మెన్స్ క్రెడిట్ ఎంత అన్నది పక్కన పెడితే ఉప్పెన అంటే బేబమ్మ గుర్తుకు వచ్చేలా చేసింది. ఐతె ఆ క్రేజ్ తో ఐదారు సినిమాల ఆఫర్లు అందుకుంది. ఐతే అన్నీ కూడా మంచి సినిమాలే అనుకుని ఓకే చేసిన అమ్మడికి ఫెయిల్యూర్స్ కొత్త పాఠం నేర్పించాయి. ఆఫర్లు వస్తున్నాయి కదా అని సైన్ చేస్తే కెరీర్ ఇలానే రిస్క్ లో పడుతుందని లేటుగా తెలుసుకుంది కృతి శెట్టి.
అందుకే ఇప్పుడు కెరీర్ ని మళ్లీ గాడిన పడేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కృతి శెట్టి ప్రస్తుతం తెలుగులో సినిమా అవకాశాలు అందుకోలేకపోతున్నా తమిళంలో రెండు మూడు ఆఫర్లు చేజిక్కించుకుంది. ఐతే 100 కోట్ల హీరోయిన్ కు ఆఫర్లు లేకుండా అయిపోయింది. తెలుగులో ఆమె చేసిన సినిమాల్లో ఉప్పెన తర్వాత శ్యాం సింగ రాయ్ ఈ రెండు తప్ప మరో సినిమా ఆడలేదు.
ఐతే ఇప్పుడు ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు చేస్తున్న చరణ్ సినిమాలో ఛాన్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది కృతి శెట్టి. ఆ సినిమాలో ఆల్రెడీ జాన్వి కపూర్ హీరోయిన్ గా లాక్ అయ్యింది. ఐతే అందులో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఉందని తెలిసిన కృతి శెట్టి డైరెక్టర్ బుచ్చి బాబుకి టచ్ లోకి వచ్చిందట. ఎలాగైన తనకు ఆ అవకాశాన్ని ఇప్పించాలని ఆయన్ను అడుగుతుందట. ఐతే బుచ్చి బాబు కృతి రిక్వెస్ట్ ని ఒప్పుకుంటాడా లేదా అన్నది చూడాలి. చరణ్ 16వ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. మరి ఆమె రిక్వెస్ట్ ని బుచ్చి బాబు యాక్సెప్ట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. 2025 ఫస్ట్ లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: