సుక్కు - బన్నీ కాంబో ఎప్పుడూ సూపర్ హిట్టే..

Suma Kallamadi
* బన్నీతో లెక్కలు మాస్టారు కలిస్తే సూపర్ హిట్టే
* వీరి కాంబినేషన్ సినిమాలు చూసేందుకు అసలు బోర్ కొట్టవు
* నాలుగో సారి వీరి కాంబోలో వస్తున్న సినిమా పుష్ప 2
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
లెక్కల మాస్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిస్తే బాక్సాఫీస్ బద్దల అవ్వాల్సిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ వస్తుందంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వారిద్దరూ కలిసి పుష్ప 2 మూవీ చేస్తున్నారు. ఇది కూడా భారీ హీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతకంటే ముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలేంటి, అవి అంత పెద్ద హిట్టయ్యాయి, ఎంత విభిన్నమైన కథలతో వచ్చాయో తెలుసుకుందాం.
పుష్ప: ది రైజ్
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప: ది రైజ్' సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించాడు. బన్నీ అడవుల్లో పెరిగే ఎర్రచందనం చెట్లను దొంగతనం చేసి వేరే దేశాలకు అమ్మే వ్యాపారం చేస్తాడు. ఈ క్యారెక్టర్ చేయాలంటే గుండెల్లో దమ్ము ఉండాలి బన్నీ సుకుమార్ ని నమ్మి దీనిని చేసి చివరికి నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సినిమాలో బన్నీ రోజు కూలీ చేసే ఒక సామాన్య వ్యక్తిగా కనిపిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యాపారంలోకి వెళ్లి చివరకు ఆ వ్యాపారానికి అధిపతి అవుతాడు.
ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు మంటలు పుట్టిస్తాయి. ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యాపారం ఎంత పెద్ద వ్యాపారమో, దాన్ని ఎలా నడుపుతారో చాలా రియలిస్టిక్‌గా చూపించారు. అంతేకాకుండా ఈ సినిమాలోని పాటలు కూడా చాలా హిట్ అయ్యాయి.
• ఆర్య - ప్రేమ కథా చిత్రం
సుకుమార్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'ఆర్య'. ఈ సినిమాతోనే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ మొదలయ్యింది. ఈ సినిమా ప్రేమ కథా చిత్రంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇందులో ఆర్య అనే యువకుడు గీత అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఇంతలో ఆ గీతకి ఆర్యకి స్నేహితుడు అజయ్ తో ప్రేమలో పడుతుంది. ఇప్పుడు ఆర్య ఏం చేస్తాడో, ఈ ముగ్గురి మధ్య ఏం జరుగుతుందో అనేది కథ. ఈ సినిమాలో ఎన్నో ట్విస్ట్‌లు, టర్న్‌లు, ఎమోషనల్ సీన్లు ఉంటాయి.
ఈ సినిమా మొదట్లో హిట్ అవుతుందో లేదో అని చిత్ర బృందానికి కొంత అనుమానం ఉండేది. కానీ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా యువత ఈ సినిమాని ఎంతగానో ఆదరించారు. ఇప్పటికీ ఈ సినిమా యూత్‌ ఆడియన్స్ ఎంతో ఇష్టంగా చూస్తుంటారు.
ఆర్య 2 - అన్నదమ్ముల కథ
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్య' సినిమాకి కొనసాగింపుగా వచ్చిన సినిమా 'ఆర్య 2'. ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ హీరోగా నటించాడు. ఆర్య, అర్జున్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ అనాధ ఆశ్రమంలో పెరుగుతారు. అయితే వీళ్లు చిన్నప్పుడే వేరైపోతారు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు తెలియకుండా పెద్దవారు అవుతారు. కొన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ తిరిగి కలుస్తారు. కానీ వింత, వీళ్ళిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు కాజల్, శ్రద్ధా దాస్, నవదీప్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: