షూటింగ్ కంప్లీట్ చేసిన వరుణ్.. కీలక అప్‌డేట్ ఔట్!!

Suma Kallamadi
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా పేరు 'మట్కా'. ఈ సినిమాని కరుణ కుమార్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. విజయేందర్ రెడ్డి తీగల, రాజని తల్లురి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తాజాగా కంప్లీట్ అయింది. ఇక పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా పూర్తయితే ఈ ఏడాదిలోగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ మూవీ డేట్ కూడా అమౌంట్ చేశారు. ఇది బన్నీ హీరోగా వస్తున్న పుష్ప సినిమాతో పోటీ పడే అవకాశం ఉందని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన టీజర్, మేకింగ్ వీడియోలు విడుదలై చాలామందిని ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా పర్వదినం సందర్భంగా ఈ సినిమా టీమ్ ఒక కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్ చాలా అందంగా, టెరిఫిక్ గా కనిపించారు. వరుణ్ తేజ్ నటిస్తున్న 'మట్కా' సినిమా నవంబర్ 14న విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రచారం కూడా బాగా జరుగుతోంది.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో పాటు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి పనులు కూడా చాలా బాగా చేశారు. వరుణ్ తేజ్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో 'మట్కా' సినిమానే అత్యధిక బడ్జెట్ తో వస్తోంది. ఈ సినిమా చాలా బాగుంటుందని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇందులో చాలా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి. రవి శంకర్ తదితరులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడుదల తేదీకి సమయం దగ్గర పడుతున్న వేళ వరుణ్ తేజ్ అభిమానుల్లో హైప్స్ మరింత పెరిగిపోతున్నాయి. ఈ మూవీ చూసి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పొందాలని ఆడియన్స్ బాగా ఎదురు చూస్తున్నారు. వరుణ్ ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: