బాలీవుడ్‌లో దేవ‌ర న‌యా రికార్డ్‌... తార‌క్‌కు ఇక నార్త్‌లోనూ తిరుగులేన‌ట్టే..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెర‌కెక్కిన సినిమా దేవర‌. 2018 చివ‌ర్లో ఎన్టీఆర్ హీరోగా సోలోగా వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా త‌ర్వాత ఆరేళ్ల పాటు లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ ఈ సినిమా చేశారు. మ‌ధ్య లో ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమాలో న‌టించినా అది మ‌ల్టీస్టార‌ర్ సినిమా కావ‌డం తో అనుకున్న పేరు ఎన్టీఆర్ కు రాలేదు. ఆ సినిమా విజ‌యం లో ఎన్టీఆర్ - రామ్‌చ‌ర‌ణ్ మాత్ర‌మే కాదు.. వీరిద్ద‌రి కంటే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కే ఎక్కువ‌ పేరు వ‌చ్చింది.

ఇక ఇప్పుడు దేవ‌ర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ పేరు మార్మోగి పోతోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరో అయితే .. బాలీవుడ్ నుంచి మరో యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ గా న‌టించ‌డం .. అదే టైంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా చేయ‌డంతో నార్త్ లో కూడా సినిమాకు మంచి హైప్ వ‌చ్చింది. తెలుగు సహా హిందీ భాషల్లో మేజర్ గా దేవర భారీ వసూళ్లు అందుకుంటూ వస్తోంది.

విచిత్రం ఏంటంటే ఈ వసూళ్ళలో హిందీ మార్కెట్ వసూళ్లు సినిమా వచ్చి రెండు వారాలు దాటినా డీసెంట్ హోల్డ్ తో కొనసాగుతుంది. ఇప్ప‌టికే అక్క‌డ దేవ‌ర సినిమా రు. 60 కోట్ల నెట్ వ‌సూళ్లు దాటేసింది. నిజంగా ఈ సినిమా అక్క‌డ రు. 15 కోట్ల వ‌సూళ్లు సాధిస్తే గ్రేట్ అనుకున్నారు. ఏకంగా దానికి నాలుగు రెట్ల వ‌సూళ్లు సాధించ‌డం తో అంద‌రూ షాక్ అవుతున్నారు. లాంగ్ ర‌న్ లో ఈ సినిమా బాలీవుడ్ లో రు. 100 కోట్లు సాధిస్తుందా ? లేదా ? అన్న‌ది చూడాలి. దేవ‌ర సినిమాకు త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: