నందమూరి కేరిర్లోనే బ్లాక్ బస్టర్ గా నిల్చిన మూవీకు పెట్టిందేంత.? కొల్లగొట్టిందేంత.?

FARMANULLA SHAIK
నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో  బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సమరసింహారెడ్డి’ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కంటే ముందు వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘లారీ డ్రైవర్’ ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఏడేళ్ల తర్వాత దర్శకుడు బి.గోపాల్, హీరో బాలకృష్ణ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘సమరసింహారెడ్డి’, ఈ చిత్రం తెలుగులో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను క్రాస్ చేసింది.‘సమర సింహారెడ్డి’ చిత్రం 13 జనవరి 1999న మిలినియం చివరి యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఇండస్ట్రీ రికార్డ్స్‌‌ను నెలకొల్పింది. అంతేకాదు తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది ఈ మూవీ. ‘సమరసింహారెడ్డి’ సక్సెస్‌తో తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలు క్యూ కట్టాయి. దాదాపు తెలుగులో అందరు హీరోలు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో సినిమాలు చేసి మంచి సక్సెస్‌లు అందుకున్నారు. ఒక రకంగా తెలుగులో ‘సమరసింహారెడ్డి’ ఫ్యాక్షన్ సినిమాల ఒరవడికి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్’ పతాకంపై చెంగల వెంట్రావు నిర్మించారు. నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హాట్రిక్ మూవీ కోసం రచయత విజయేంద్ర ప్రసాద్ నుంచి 30 కథలు విని.. ఫైనల్‌గా ఈ స్టోరీని ఫైనలైజ్ చేశారు. అప్పటి వరకు యాక్షన్, ఫ్యామిలీ స్టోరీలనే ఆదరించే ప్రేక్షకులు.. ‘సమరసింహారెడ్డి’ మూవీ ఆదరించారు. 1999 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. 

ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్ చెప్పిన ‘నేను గట్టిగా తొడ చరిచానంటే ఆ సౌండ్ కే గుండే ఆగి చచ్చిపోతావు’ అనే డైలాగ్‌తో పాటు నీ ఊరు వచ్చా.. నీ ఇంటికి వచ్చా.. నీ నట్టింటికీ వచ్చా అంటూ బాలయ్య చెప్పే డైలాగులతో పాటు.. ఈ సినిమాలో విలన్‌గా నటించిన జయప్రకాష్ రెడ్డి చెప్పినా.. సమర సింహారెడ్డి.. ఢిల్లీ వీధుల్లో కాదు.. సీమ సందుల్లో రారా.. నీ ప్రతాపమో.. నా ప్రతాపమో అన్న డైాలాగులు సూపర్ హిట్‌గా నిలిచాయి. మొత్తంగా ఈ సినిమాలోని డైాలాగుల గురించి ఎంత చెప్పినా.. తక్కువే. దాదాపు రూ. 6  కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 17 కోట్ల  నుంచి రూ. 20 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఇక ఈ చిత్రంలో ఎలాంటి లవ్ ట్రాక్ లేకుండా తెరకెక్కించారు.ఇలా బాలయ్య కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కాగా ఈ మూవీ 3 థియేటర్లలో ఏకంగా 227 రోజులు నడిచింది. అలాగే 29 కేంద్రాల్లో 175 రోజులు, 122 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శించబడింది. బాలకృష్ణను ఒక స్థాయిలో నిలబెట్టిన సినిమా సమరసింహారెడ్డి అని చెప్పవచ్చు. ఆ తర్వాత బాలయ్య, బి.గోపాల్ కాంబినేష్‌లో ‘నరసింహనాయుడు’ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. చివరగా వీళ్ల కాంబినేషన్‌లో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా వచ్చింది.ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ‘హర హర మహదేవ’ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన ఎందుకో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఏమైనా బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలనుకునే అభిమానులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: