వామ్మో.. నిజంగానే అల్లు అర్జున్ అంత మాట అన్నాడా..? మళ్లీ అడ్డంగా బుక్ అయిన బన్నీ..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరుని ఏ విధంగా ట్రోల్ చేశారో మనం చూస్తూనే ఉన్నాం.  నిన్న మొన్నటి వరకు కూడా అల్లు అర్జున్ అంటే మెగా హీరో అని ..మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోనే అని.. మెగా హీరోలు ఆయనకు సపోర్ట్ చేస్తారు అని .. అల్లు అర్జున్ ఇంత స్ధాయికి ఎదగడానికి కారణం మెగా ఫ్యామిలీనే అని అందరూ మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే ఏపీ పాలిటిక్స్ లో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వేలు పెట్టిందో అప్పటినుంచి అల్లు వర్సెస్ మెగా అన్న రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది . దానికి కారణాలు మనకు తెలిసిందే. అల్లు అర్జున్ జనసేన కు సపోర్ట్ చేయకుండా వైసిపి క్యాండిడేట్ కు సపోర్ట్ చేయడం ..బన్నీ సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపోవడం .. జనసేన నేతలు అత్యధిక మెజారిటీతో గెలిచి ఏపీలో కూటమి ప్రభుత్వం ఫాం చేయడం బన్నీకి నెగటివ్గా మారిపోయింది.

అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బన్నీ విష్ చేయడం బన్నీ పెట్టిన మెసేజ్ కి పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వడం లు కుటుంబాల మధ్య గొడవలు లేవు వాళ్ళు ఎప్పటికీ ఒకటే అంటూ జనాలు మాట్లాడుకున్నారు . అయితే ఎట్టొచ్చి పవన్ కళ్యాణ్ పరోక్షకంగా పుష్ప2 పై చేసిన కామెంట్స్ మళ్లీ వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ ప్రూవ్ చేసింది అని జనాలు మాట్లాడుకుంటున్నారు. కాగా బాలకృష్ణ హౌస్ట్ చేసిన అన్ స్టాపబుల్ సీజన్ 3 మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్ కాబోతుంది . ఈ సీజన్ 3 కి గెస్ట్ గా అల్లు అర్జున్ హాజరయ్యాడు అంటూ తెలుస్తుంది .


ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందట . ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎపిసోడ్లో బాలయ్య - బన్నీను మెగా ఫ్యామిలీతో ఉన్న గొడవలపై ఓపెన్ గా అడిగినట్లు తెలుస్తుంది . అంతేకాదు అల్లు అర్జున్ సైతం అసలు జరిగిన విషయాన్ని కోపంగా బాలయ్య ముందు బయట పెట్టేసాడట . మరీ ముఖ్యంగా వైసిపి క్యాండిడేట్ కి సపోర్ట్ చేయడం .. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లో ఎందుకు పాల్గొనలేకపోయాడు అనే విషయాలపై ఓపెన్ గా చెప్పుకొచ్చారట .


అంతేకాదు సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ పై కూడా బన్నీ ఘాటుగా జవాబు ఇచ్చినట్లు తెలుస్తుంది . మరి ముఖ్యంగా ఎవరైతే తనను ఫ్యామిలీ పరంగా ట్రోల్ చేశారో.. అలాంటి వాళ్లకి ధీటైనా జవాబే ఇచ్చాడట . అసలు బన్నీ ఏం మాట్లాడాడు..? నిజానికి మెగా - అల్లు కుటుంబాల మధ్య గొడవ పెట్టింది ఎవరు..? అన్న విషయాలు తెలియాలి అంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ వరకు ఆగాల్సిందే.  అయితే ఒకటి మాత్రం నిజం అంటున్నారు బన్నీ అభిమానులు ఎవరైతే బన్నీని అనవసరంగా ట్రోల్ చేసి ఆయన కెరీర్ ని దెబ్బ కొట్టడానికి చూశారో.. వాళ్ళు నిజంగానే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన డే దగ్గరలోనే ఉంది అని ..కొందరు దారుణాతి దారుణమైన పదాలతో బన్నీను ట్రోల్ చేశారు అని ..అలాంటి వాళ్లను అస్సలు విడిచిపెట్టబోమని బన్నీ ఫ్యాన్స్ కోపంగా వార్న్ చేస్తున్నారు. అన్ని చూస్తుంటే బన్నీ అన్ స్టాపబుల్ కారణంగా మరోసారి బుక్కైన్నట్లు ఉంది అంటున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: