మహేష్ బాబుని ముద్దుగా నమ్రత అలా పిలుస్తుందా..? మేడం టూ రొమాంటికే..!

Thota Jaya Madhuri
ఒకప్పుడు భార్యలు ..భర్తలని పేరు పెట్టి పిలవాలి అంటేనే గజగజ వణికి పోయేవారు . . మన హిందూ సాంప్రదాయం ప్రకారం భర్తని భార్యలు పేరు పెట్టి  పిలిస్తే వాళ్ళ ఆయుషు తగ్గిపోతుంది అని నమ్మేవారు . . కానీ ఇప్పుడు అలాంటి సెంటిమెంట్స్ అన్ని తుడిచిపెట్టుకుపోయాయి.  ఏకంగా భర్తని భార్యలు పేరు పెట్టి ఏరా ... ఓరేయ్.. పోరా అంటూ కూడా పిలిచేస్తున్నారు. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ ఎటువంటి పేరుతో పిలుస్తారు అని తెలుసుకోవడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .


సోషల్ మీడియాలో మహేష్ బాబు -నమ్రతలకు  సంబంధించిన అదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద క్యూట్ రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్న ఈ జంట  చూడ చక్కగా అన్యోన్యంగా ఉంటారు  అన్న సంగతి అందరికీ తెలుసు .   టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న మహేష్ బాబు ని ప్రేమించి పెళ్లిచేసుకున్న నమ్రత సినిమాల ఊసే ఎత్తకుండా.. మహేష్ బాబు కోసం తన కెరీర్ ని సైతం వదులుకుంది.


అటువంటి నమ్రత . .. మహేష్ బాబుని ముద్దుగా మహి అంటూ పిలుస్తుందట . అంతేకాదు మహేష్ బాబు ముద్దుగా బేబీ అంటూ పిలుస్తాడట. . ఈ విషయాన్ని బిజినెస్ మ్యాన్ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో స్వయాన  చెప్పుకు వచ్చింది .. డైరెక్టర్ పూరి జగన్నాధ్ బలవంతం చేయగా మహేశ్ - నమ్రత ఆ సీక్రేట్ బయటపెట్టారు. ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. . దీంతో మహేష్ బాబు - ఆయన భార్య టూ రొమాంటిక్ కపుల్ అంటూ తెగ మాట్లాడుకుంటున్నారు జనాలు. ప్రసెంట్ మహేశ్ బాబు ..రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కేబ్ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: