తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాచురల్ స్టార్
నాని పోయిన సంవత్సరం
దసరా , హాయ్
నాన్న అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు మూవీలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక
నాని ఈ సంవత్సరం సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే
నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ది థర్డ్ కేస్ అనే
మూవీ ని మొదలు పెట్టాడు.
ఈ
మూవీ నుండి ఒక చిన్న వీడియోను కూడా మేకర్స్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే
నాని ,
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఓ
మూవీ ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఇది వరకు వీరి కాంబోలో రూపొందిన
దసరా మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో వీరి కాంబోలో రూపొందబోతున్న రెండవ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. ఇకపోతే ఈ
మూవీ బృందం మొదట ఈ సినిమాకు దేవి
శ్రీ ప్రసాద్ ను
సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నట్లు ఓ వార్త వైరల్ అయింది.
ఆ తర్వాత ఈ
మూవీ బృందం వారు దేవి
శ్రీ ప్రసాద్ ను కాకుండా అనిరుద్ రవిచంద్రన్ ను
సంగీత దర్శకుడిగా ఓకే చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ
మూవీ బృందం వారు అనిరుద్ రవిచంద్రన్ ఓకే చేసుకోవడానికి ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటివరకు ఈ సినిమాకు సంగీతం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు సమాచారం. ఒక వేళ అనిరుద్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఈ
మూవీ యూనిట్ ఏం చేస్తుంది అనేది చూడాలి.