తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో
ప్రశాంత్ వర్మ ఒకరు. ఈయన అ! అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి
సినిమా తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ దర్శకుడు
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) పేరుతో సినిమాలను చేయడం మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ యూనివర్స్ లో భాగంగా కొన్ని రోజుల క్రితమే హనుమాన్ అనే
సినిమా వచ్చింది.
ఈ
సినిమా తెలుగు ,
తమిళ్ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో
ప్రశాంత్ వర్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా ఈ యూనివర్స్ నుండి లేడీ ఓరియంటెడ్
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. తాజాగా ఈ
మూవీ బృందం
ప్రశాంత్ వర్మ సినిమా నుండి
మహా కాళీ అనే లేడీ ఓరియంటెడ్
మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. తాజాగా ఈ
మూవీ బృందం వారు విడుదల చేసిన ఈ
సినిమా ఫస్ట్ లుక్
పోస్టర్ , ఈ
సినిమా టైటిల్ అద్భుతంగా ఉండడంతో ఒక్క సారిగా ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమాకు
ప్రశాంత్ వర్మ కథను అందించనుండగా ... పూజ
అపర్ణ కొల్లూరు అనే మహిళ దర్శకురాలు ఈ
మూవీ కి దర్శకత్వం వహించబోతుంది. రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ
మూవీ ని నిర్మించబోతున్నాడు. ఇకపోతే ఈ
మూవీ బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది.