తమిళ నటుడు
సూర్య ప్రస్తుతం కంగువా అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాను
నవంబర్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
మూవీ ని
తమిళ్ తో పాటు అనేక భాషలలో విడుదల చేయనున్నారు. అలాగే ఈ సినిమాను తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. రెండు విభిన్న కాలాల మధ్య ఈ
సినిమా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ లో మోస్ట్
బ్యూటిఫుల్ నటిమని
దిశా పటాని హీరోయిన్గా నటిస్తూ ఉండగా ...
శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా పరవాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ
మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల
థియేటర్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ ఏకంగా 50 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నిజంగానే ఈ
సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల
థియేటర్ హక్కులు 50 కోట్లకు అమ్ముడుపోయినట్లయితే ఈ
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలవాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో 55 కోట్ల మేర షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంటుంది.
మరి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో
బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లయితేనే ఈ స్థాయి కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ
మూవీ వసూలు చేసే అవకాశం ఉంటుంది. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ
సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.