వామ్మో.. పుష్ప-2 కోసం పహాద్ ఫాజిల్ అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా?

praveen
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చిన్న హీరోలు ఇలా చాలామంది ఉన్నారు. కానీ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఆ పాత్రలకు ప్రాణం పోసే వర్సటైల్ యాక్టర్స్ మాత్రం కొంతమంది ఉన్నారు. అలాంటివారు ఏ పాత్ర పోషించిన కూడాఆ పాత్రకి వారు తప్ప ఇంకొకరు సరిపోరు అన్న రేంజ్ లో నటిస్తూ ఉంటారు. తమ నటనతో ప్రేక్షకులని ఫిదా చేసేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే  అలాంటి వారిలో మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పహాడ్ ఫాజిల్ కూడా ఒకరు.

 ఈయన ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే ఇంకోవైపు ఇతర హీరోల సినిమాల్లో విలన్ సహ మరిన్ని కీలకపాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఫహాద్ పజిల్ అటు పుష్ప సినిమాలో చేసిన పాత్ర అయితే ఇక అయన యాక్టింగ్ కి పీక్ లెవెల్ అనడంలో సందేహం లేదు. ఇక ఈ పాత్రతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే పుష్ప మొదటి పార్ట్ లో ఫహద్ ఫాజిల్ నటించిన బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కేవలం కొంత సేపు మాత్రమే కనిపిస్తుంది  కానీ ఇక రెండవ పార్ట్ మాత్రం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అని చెప్పాలి.

 దీంతో ఇక ఎక్కువ రోజులపాటు అటు పుష్ప సినిమా కోసం ఫహద్ ఫాసిల్ కాల్ షీట్స్ కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఫహద్ ఫాజిల్ ఆ సినిమా కోసం ఎంత పారితోషకం తీసుకున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే పుష్ప మొదటి పార్ట్ కోసం ఏకంగా మూడు కోట్ల వరకు పారితోషకం తీసుకున్న ఫహద్ ఫాజిల్ పుష్ప 2 కోసం మాత్రం పారితోషకాన్ని రెట్టింపు చేశాడట. ఏకంగా 7.2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన విడుదల కాబోతుంది   ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కు సంబంధించిన ఎడిటింగ్ ని లాక్ చేసినట్లు మూవీ టీమ్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: