దేవర-2 ఎలా ఉండబోతుంది.. అంచనాలు పెంచేలా.. షాకింగ్ విషయాలు చెప్పిన కొరటాల?

praveen
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర మూవీ ఇటీవల ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హీట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఒక రేంజ్ లో పెరిగిపోయాయ్. ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫాన్స్ అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అదే సమయంలో ఇప్పటికే కొరటాల శివ-  జూనియర్ ఎన్టీఆర్ కాంబో హిట్ కాంబో కావడంతో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.

 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి రోజు యావరేజ్ టాక్ రావడంతో ఫ్లాప్ గా మిగిలిపోతుందేమో అని అభిమానులు భయపడిపోయారు. అయితే ఇలా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ అటు దేవర సినిమా మాత్రం వసూళ్ళలో సంచలనమే సృష్టించింది. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం  చేసుకుంది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు ఇక ఓవర్సీస్ లో కూడా వసూళ్లలో దుమ్ము దులిపేసింది ఈ మూవీ. దీంతో దేవర పార్ట్ 2 పై అందరి దృష్టిపడింది. ఇక పార్ట్ 2 అంతకుమించి ఉండబోతుందని అభిమానులు అందరూ కూడా అంచనాలు పెట్టుకుంటున్నారు.

 ఇలాంటి సమయంలో దేవర పార్ట్ 2 పై అభిమానుల అంచనాలు రెట్టింపు అయ్యే విధంగా కొరటాల శివ ఇటీవల ఇక రెండో పార్ట్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మొదటి పార్ట్ తో పోల్చి చూస్తే రెండో భాగం మరింత భారీగా ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇందులోని క్యారెక్టర్లు ప్రేక్షకుల్లో ఉత్కంఠకు గురిచేస్తాయి అంటూ తెలిపాడు. పార్ట్ 2 లో జాన్వి క్యారెక్టర్ కు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా రెండవ భాగంలోనే కథలో అసలైన మార్పు చోటు చేసుకుంటుంది అంటూ తెలిపాడు. ఇక రెండో భాగంలోని కొన్ని ఎపిసోడ్స్ అయితే అటు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చాడు. ఇక కొరటాల మాటలతో అభిమానుల్లో రెండో పార్ట్ పై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: