తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరో గా నటించి తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఒకసారి ఓ దర్శకుడికి సినిమా చేస్తాను అని మాట ఇస్తే ఆ దర్శకుడి ట్రాక్ రికార్డు ఎలా ఉన్న పట్టించుకోకుండా సినిమా చేస్తాడు. ఒక సారి మాట ఇస్తే అసలు తప్పడు అని గొప్ప పేరును కలిగి ఉన్నాడు.
ఇలా మాట ఇచ్చిన క్రమంలో ఒక సారి ఓ దర్శకుడితో సినిమా చేసే విషయంలో చిరంజీవి మాటను కూడా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి ఓ దర్శకుడి తో సినిమా చేసినట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది ..? ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా గుడుంబా శంకర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ స్టార్ట్ కావడానికి ముందు ఈ సినిమా కథను ఒక సారి చిరంజీవి విన్నాడట. దానితో చిరంజీవి కి ఈ కథతో సినిమా చేస్తే మూవీ సక్సెస్ కాదు.
ఈ సినిమా చేయకు అని పవక్ కి సలహా ఇచ్చాడట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం గతంలోనే వీర శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తాను అని మాట ఇచ్చాను. అతనితో కచ్చితంగా సినిమా చేయాలి. లేకుంటే ఇచ్చిన మాటకు విలువ ఉండదు అని చిరంజీవి చెప్పినా కూడా వినకుండా వీర శంకర్ దర్శకత్వంలో గుడుంబా శంకర్ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డాడట. ఇక మంచి అంచనాల నడుమ విడుదల అయిన గుడుంబా శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇచ్చిన మాట కోసం పవన్ ఏకంగా చిరంజీవి మాటను కూడా కాదన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.