తెలుగు సినీ పరిశ్రమలో
మాస్ మహారాజా రవితేజకు మంచి గుర్తింపు ఉంది. ఈయన ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి స్థాయికి చేరుకున్నాడు. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో వరుస విజయాలను అందుకున్న
రవితేజ ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పెట్టి అపజయాలను అందుకుంటూ వస్తున్నాడు.
రవితేజ కొంత కాలం క్రితం
మిస్టర్ బచ్చన్ అనే
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.
ఇది ఇలా ఉంటే
రవితేజ తన నెక్స్ట్
మూవీ ని
తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి
సుందర్ సి దర్శకత్వంలో చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే
రవితేజ తో సుందర్ ఓ
కామెడీ ఎంటర్టైనర్
మూవీ ని రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం
రవితేజ తమిళ దర్శకుడు అయినటువంటి
శివ దర్శకత్వంలో దరువు అనే ఓ
కామెడీ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.
ఈ సినిమాతో
రవితేజ కు గొప్ప గుర్తింపు కూడా ఏమీ రాలేదు. ఇలా ఇప్పటికే ఒక సారి
తమిళ దర్శకుడిని నమ్మి
బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ను అందుకున్న
రవితేజ మరోసారి మరో
తమిళ దర్శకుడుని నమ్మి అతనితో
సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజంగానే సుందర్ దర్శకత్వంలో
రవితేజ సినిమా చేస్తే ఆ
మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.