అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్ కావడానికి అదే కారణం.. శ్రీను వైట్ల..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు శని పరిశ్రమలు స్టార్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగించిన శ్రీను వైట్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో అనేక కామెడీ ఓరియంటెడ్ సినిమాలను రూపొందించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు హీరోగా దూకుడు అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. దానితో ఒక్క సారిగా శ్రీను వైట్ల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత ఈయనకు భారీ క్రేజ్ వచ్చేసింది.

ఆ తర్వాత ఈ దర్శకుడు స్టార్ హీరోలతో సినిమాలను చేశాడు. కానీ ఆ తర్వాత ఈయన చేసిన సినిమాలు ఏవి కూడా భారీ స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో ఈయన కెరియర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు గోపీచంద్ హీరోగా విశ్వం అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా అక్టోబర్ 11 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈయన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఆ ఇంటర్వ్యూలో భాగంగా శ్రీను వైట్ల తన దర్శకత్వంలో రూపొందిన అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ ఫ్లాప్ కావడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ ... అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ ఒక సీరియస్ స్టోరీగా వెళుతుంది. అలాంటి సినిమాలు పెద్దగా జనాలకు నచ్చవు. అందుకే ఆ సినిమా జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఆ మూవీ అందువల్లే ప్లాప్ అయ్యింది అని శ్రీను వైట్ల తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ లో రవితేజ హీరోగా నటించగా ... ఇలియానా ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: