టాలీవుడ్ లేడీ వ‌ల‌పు వ‌ల‌లో చిక్కుకున్న నిర్మాత‌...!

RAMAKRISHNA S.S.
తెలుగు సినిమా రంగంలో ఉన్న చిలకకొట్టుడు విషయాలు చాలా ఉంటాయి. తెరవెనక చాటుమాటుగా చాలా నడుస్తూ ఉంటాయి. అవి అప్పుడప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి. ఎవరు ఎంత దాచేయాలని చూసినా ఏదో ఒకప్పుడు అది బయటకు రాక తప్పదు. రెండు నెలల క్రితం ఓ అగ్ర నిర్మాత వలపుల వలలు చిక్కుకున్నారు. ఇద్దరూ కలిసి తిరిగిన అన్ని రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత ఆమె అడ్డం తిరిగింది. చివరకు డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళింది. ఆఖరికి అది ఇప్పుడు సెటిల్మెంట్ దిశగా నడుస్తోంది. భారీ మొత్తం సమర్పించుకుని అతడు ఆమెను వదిలించుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆ నిర్మాతకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు.

ఇప్పుడు లేటెస్ట్ గా మరో నిర్మాత కూడా వలపుల వలలో చిక్కుకుని చాలా తెలివిగా ముందే బయట పడినట్టు తెలుస్తోంది. విషయం ఏంటంటే ఆయన ఓ బిజినెస్‌మ్యాన్‌. సరదాగా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఓ సినిమా చేశారు. మరో సినిమా చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఓ విభాగానికి చెందిన ఓ అమ్మడితో స్నేహం చిగురించింది. ఇలాంటి స్నేహాలు చిగురింప చేసుకోవడంలో ఆమె చాలా పెద్దదిట్ట అని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. ఈ సంగతి తెలియక ఈ పెద్దాయన ముగ్గులోకి దిగిపోయాడు. ఆమెతో కొద్దిరోజులుగా ఎంజాయ్ చేశాడు. తర్వాత అసలు కథ మొదలైంది. ఆమె అడ్డం తిరిగింది. ఇప్పుడు ఇబ్బంది మొదలైంది. అయితే ఆ యువ నిర్మాత చాలా తెలివిగా ఈ విషయాన్ని ముందుగానే ఎలా సెటిల్ చేసుకోవాలో అలా సెటిల్ చేసుకుని బయటపడ్డాడు.

అవతల అమ్మడు కూడా తెగేదాకా లాక్కునే వ్యవహారం కాదు. ఎందుకంటే ఆమెకు కావలసింది డబ్బు. ఎంజాయ్ చేసిన అన్ని రోజులు ఎంజాయ్ చేసి.. తనకు కావలసింది తీసుకొని చాలా తెలివిగా సైడ్ అయిపోతుంది. అందుకే ఆమె కూడా సెటిల్మెంట్ కు చాలా హ్యాపీగా సహకరించారు. తనకు కావలసింది తాను తీసుకుని ఇప్పుడు ఎవరి దారిలో వారు ఉన్నారు.  ఇకపై అయినా టాలీవుడ్ లో నిర్మాతలు, దర్శకులు ఇలాంటి వలపుల వలలో చిక్కుకోకుండా ఉంటే చాలా బెటర్. ఒక్కసారి ఇలాంటి విషయాలు బయటకు వస్తే వాళ్ళ పరువు ఇమేజ్ అంతా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: