టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా
గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్
ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రాజు నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్
తమన్ సంగీతం అందిస్తున్న ఈ
మూవీ లో ఎస్ జే
సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా ... ఈ
మూవీ లో కియార అద్వానీ హీరోయిన్గా కనిపించబోతుంది.
అంజలి ,
సునీల్ ,
శ్రీకాంత్ ,
నవీన్ చంద్ర ఈ
మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం
డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.
ఇక ఈ మధ్య కాలంలో ఈ
సినిమా నుండి కొన్ని పోస్టర్లను , ఒక పాటను విడుదల చేసిన కానీ అందులో మాత్రం ఈ
సినిమా విడుదల తేదీని మేకర్స్ మెన్షన్ చేయలేదు. దానితో ఈ
మూవీ విడుదల ఈ సంవత్సరం
డిసెంబర్ నెలలో ఉంటుందా లేదా అని అనుమానాలు చాలా మంది లో వ్యక్తం అవుతున్నాయి. కానీ ఈ
మూవీ బృందం మాత్రం ప్రచారాలను స్పీడ్ గా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ
దసరా పండక్కి ఓ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు అలాగే ఈ నెల చివరన మరో పాటను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ
మూవీ యూనిట్ చెప్పినట్లు
డిసెంబర్ 20 వ తేదీన ఈ
మూవీ విడుదల అయితే ఈ
మూవీ బృందానికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఈ
సినిమా కనుక పోస్ట్ పోన్ అయినట్లయితే ఇప్పుడే ఈ
మూవీ ప్రమోషన్ కంటెంట్ ను మొత్తం విడుదల చేస్తే ఆ తర్వాత ప్రమోషన్ చేయడానికి కంటెంట్ ఉండదు. దానివల్ల ఈ
మూవీ యూనిట్ కి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక పుష్ప
మూవీ యూనిట్ కూడా ముందే చాలా కంటెంట్ విడుదల చేసింది. ఆ
సినిమా విడుదల తేదీ పోస్ట్ పోన్ అయిన తర్వాత ఈ
మూవీ బృందం ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఏలాంటి కంటెంట్ ను విడుదల చేయడం లేదు.