బాహుబలి కట్టప్పతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు దేశం గర్వించదగ్గ స్టార్?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే వారికి సంబంధించి ఏ విషయం తెర మీదకి వచ్చి కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు కూడా ఇలా తమ ఫేవరెట్ సిరీస్ సెలబ్రెటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఇక ఇలా స్టార్ హీరో హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు ఏవైనా ఇంటర్నెట్ లోకి వచ్చాయి అంటే చాలా అభిమానులు దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.

 అయితే నేటితరంలో సినిమాలలో నటించే పాత్రలకు సంబంధించి కొత్త లుక్ ఫోటోలు ఇంటర్నెట్ లోకి రావడం సర్వసాధారణమే. కానీ కొన్ని కొన్ని సార్లు ఆయా హీరోలకు సంబంధించి చైల్డ్హుడ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో ఉన్న చిన్నోడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో తమను అలరిస్తున్న స్టార్ హీరో అన్న విషయాన్ని అభిమానులు కూడా గుర్తుపట్టలేకపోతు ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఫోటోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. మనందరికీ తెలిసిన బాహుబలి కట్టప్ప పక్కన ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఒక బుడ్డోడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఇక ఇలా సత్యరాజ్ పక్కన ఉన్న ఆ బుడ్డోడు ఇప్పుడు ఏకంగా దేశం గర్వించదగ్గర నటుడు. ఎలాంటి వైవిధ్యమైన పాత్ర చేసిన ఆ పాత్రకు ప్రాణం పోస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు ఫహద్ ఫాజిల్. మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న ఇతను కమర్షియల్ సినిమాల మాత్రమే.. కాదు ఏకంగా వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ అదరగొడుతున్నాడు. ఈయన తండ్రి ఫాజిల్ కూడా ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణించారు. పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ శకావత్ అనే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 తో కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక అతన్ని ప్రేక్షకులు అందరూ వర్సటైల్ యాక్టర్ అని పిలుచుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: