చిరంజీవి కే షూటింగ్లో చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..!

Amruth kumar
మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు భారతీయ చిత్ర పరిశ్రమ లోనే ప్రత్యేకమైన క్రేజ్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా చిరు డాన్స్ వేస్తే పిల్లాడి నుండి పండు ముసలి వరకు ఎవరికైనా ఊపు రావాల్సిందే. ఈ డాన్స్ ఆయనకు ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల స్థానం కల్పించాయి. అదేవిధంగా ఇండియాలోనే రెండో అత్యంత పౌర పురస్కారంగా  భావించే పద్మ విభీషణతో కూడా చిరంజీవి ని సత్కరించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 
అసలు విషయం ఏమిటంటే చిరు భోళాశంకర్ మూవీ షూటింగ్ సమయంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చిరంజీవితో ఎలా ఉండేది అనే విషయాలు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మెగాస్టార్. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ మరోసారి వైరల్ గా మారింది. ఇక కిర్తి సురేష్, మెగాస్టార్ చిరంజీవి, తమన్నా కలిసి నటించిన భోళాశంకర్.. ఈ సినిమాలో మెగాస్టార్ కి చెలి పాత్రలో కీర్తి సురేష్ ఎంతో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి, ఈ సినిమా షూటింగ్స్ సమయంలో కీర్తి సురేష్ తో జరిగిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్లో మా ఇంటి ఫుడ్ పెట్టలేదు కానీ తమన్నా పాపం ఏం అడిగేది కాదు.  


కానీ కీర్తి సురేష్ హైదరాబాదులో నాకు ఫుడ్ నచ్చట్లేదు అని చెప్పింది. దాంతో నేను అడగొచ్చు కదా.. అడిగితే మేం పంపిస్తాం కదా అని అన్నాను. దానికి కీర్తి సురేష్ అదే చూస్తున్నాను అని అన్నది. దీంతో అమ్మాయి కోసం రకరకాల వంటలు వండి తీసుకొచ్చే వాళ్ళం. అయితే అవన్నీ తిన్న తర్వాత చాలా బాగున్నాయి అని చెప్పి చివర్లో కొంచెం తగ్గింది అది సరిచేసి మళ్లీ పంపించండి అని అడిగేది.  ఇదేమైనా హోటల్ అనుకుంటుందా.. కరెక్ట్ గా లేదని ప్రతిసారి డిమాండ్ చేస్తూ అది కావాలి ఇది కావాలి అని ఆర్డర్ కూడా చేసేది అంటూ సరదాగా షూటింగ్ సెట్ లో జరిగిన సంభాషణలను చిరంజీవి చెప్పుకొచ్చారు. మరోసారి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: