మెగా కుటుంబం పరువు తీసిన సాయిపల్లవి ?
ఆ సినిమాలో తన పాత్రకు పెద్దగా గుర్తింపు లేదు. అనంతరం 2015లో వచ్చిన ప్రేమమ్ అనే మలయాళం సినిమాతో సాయి పల్లవికి మంచి గుర్తింపు రావడమే కాకుండా సక్సెస్ కూడా అందుకుంది. ఆ సినిమా తర్వాత సాయి పల్లవికి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఫిదా సినిమాతో ఎనలేని గుర్తింపు అందుకుంది. ఈ సినిమా అనంతరం సాయి పల్లవి ఒక్కో సినిమాకు రూ. 2 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఇదిలా ఉండగా.... సాయి పల్లవికి గతంలో చిరంజీవితో నటించే అవకాశం వచ్చిందని, కానీ ఆ ఆఫర్ రిజెక్ట్ చేసిందట.
ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు సాయి పల్లవి. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు క్యారెక్టర్ లో నటించమని మొదటగా సాయి పల్లవిని సంపాదించారట. అయితే ఆ రోల్ తనకు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసిందట. ఇక ఓ సందర్భంలో సాయి పల్లవి మెగాస్టార్ సినిమాలో నటించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. తనకు రీమేక్ సినిమాల్లో నటించడం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదని తెలిపింది.
ఆ కారణంగానే చిరంజీవి సినిమాలో నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. దీంతో ఈ సినిమాలో కీర్తి సురేష్ ను ఆ పాత్ర కోసం ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక సాయి పల్లవి కెరీర్ విషయానికి వస్తే.... ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమాలో నటిస్తోంది.