యంగ్ టైగర్
ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్
మూవీ దేవర. సెన్సేషనల్
డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిన
మూవీ 'దేవర'భారీ అంచనాలతో
సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరేండ్ల తరువాత జూ
ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశానికి అంటాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ భారీ బడ్జెట్
మూవీ మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది.ఈ నేపథ్యంలో సిని ఇండస్ట్రీలో
ఎన్టీఆర్ ' దేవర ' మానియా కొనసాగుతోంది.
ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి
కళ్యాణ్ రామ్,
సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్
మూవీ మూవీ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన
కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఆరేళ్ల తర్వాత
జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించడంతో గతంలో ఏ సినిమాకు రానంత బజ్ దేవరకు క్రియేట్ అయింది. అంచనాలకు తగ్గట్టుగానే..కొరటాల
శివ దర్శకత్వంలో దేవర హై ఓల్టేజ్యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ను ఎలివేట్ చేస్తూ.. ఇచ్చిన అనిరుధ్ ఇచ్చిన బీజీఎం, మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ పాయింట్.ఇదిలావుండగాఎన్నో ఆశలతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది అతిలోకసుందరి
శ్రీదేవి అందాల కూతురు జాన్వీ కపూర్. ఇదిలావుండగా అసలు దేవర ఫస్టాఫ్‌లో జాన్వీ జాడ లేదు. సెకండ్ హాఫ్ లో తంగం గా చలాకీగా కనిపించిన జాన్వీ కపూర్. ఒక్క చుట్టమల్లే సాంగ్ తో దుమ్మురేపింది. క్యారక్టర్ లెంగ్త్ తక్కువగానే ఉన్నా.. ప్రేక్షకులందరీకి గుర్తుండిపోయేలా అందాలు ఆరబోసింది జాన్వీ.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పాట
తారక్ ఫ్యాన్స్ కే కాకుండా మ్యూజిక్ లవర్స్ అందరికీ స్లో పాయిజన్ లా ఎక్కేసింది. ఇక
సినిమా ప్రమోషన్ కోసం 'ది గ్రేట్
ఇండియన్ కపిల్ షో'కి వెళ్లిన
తారక్,
జాన్వి,
సైఫ్ అలీ ఖాన్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.''చుట్టమల్లే' సాంగ్ అంత
రొమాంటిక్ గా తీశారు. మీ
వైఫ్ ఫీల్ అవుతుందేమో సీన్ మారుద్దామా? అని దర్శకుడికి చెప్పలేదా?' అంటూ హోస్ట్
కపిల్ శర్మ సరదాగా అడగ్గా... ''అసలు ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు
డైరెక్టర్ అక్కడ లేరు" అని
ఎన్టీఆర్, జాన్వి ట్విస్ట్ ఇచ్చారు . ఆ పాటను థాయిలాండ్లో తీశారు. అప్పుడు ఏదో పని మీద
కొరటాల అక్కడికి వెళ్లకపోవడంతో కొరియోగ్రాఫర్ ఆ పాటను షూట్ చేశారట. దానితో అంత హిట్ పాటను డైరెక్ట్ చేసింది
కొరటాల శివ కాదా అని కామెంట్స్ పెడుతున్నారు ఆడియన్స్.ఇదిలావుండగా ఇదేమి కొత్తగా జరిగిన విషయం కాదు. కానీ స్వయంగా
ఎన్టీఆర్, జాన్వీ ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఇంట్రెస్టింగ్ గా మారింది.