దసరాకు... దేవరా నుంచి అదిరిపోయే గిఫ్ట్.. మరోసారి థియేటర్లు పగిలిపోవాల్సిందే..!

Amruth kumar
మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ దేవర. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్లు దిశగా దూసుకుబోతుంది. రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. త్రిబుల్‌ ఆర్‌ వచ్చిన ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా రావటంతో ఆయన అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా డీసెంట్ టాక్ తో  రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి ఎన్టీఆర్ స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ కు చూపించింది. కొరటాల టేకింగ్ ఎన్టీఆర్ నటన అనిరుద్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి.
అయితే ఈ సినిమా విడుదలకు ముందు నుంచే పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. మరి ముఖ్యంగా దావుదీ సాంగ్ సోష‌ల్‌ మీడియాలో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్లో ఎన్టీఆర్, జాన్వి డాన్స్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఎంతో ఆకట్టుకుంది. కానీ ఈ సినిమాలో ఈ పాట ఎక్కడ కనిపించలేదు.  మూవీ చివరిలో కూడా కనిపించలేదు. దీంతో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అదే విధంగా హీరోయిన్గా నటించిన జాన్వి పాత్ర కూడా చాలా తక్కువగా ఉందంటూ విమర్శలు కూడా వస్తున్నాయి.
ఇక ఇప్పుడు దేవర టీం దసరా నుంచి పలు కొత్త సన్నివేశాలను పాటలను యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక దీంతో దసరా నుంచి థియేటర్లో కొత్త దేవర సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు.. దసరా నుంచి కొత్త దేవరాను చూడబోతున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం ఇదే వార్త ఎంతో హాట్ టాపిక్ గా మారింది. అదేవిధంగా ఎవరు వేయించను మరొక ప్రత్యేకమైన క్యారెక్టర్ ని కూడా యాడ్ చేయబోతున్నారని కూడా అంటున్నారు. ఇక మరి ఈ విషయంలో ఎంతవరకు  నిజముందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: